ఆ విషయంలో టాలీవుడ్ హీరోలను దెబ్బ కొట్టిన కోలీవుడ్ హీరో.!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సైతం ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు వారి స్టేటస్ మారిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉండే నటీనటులు సైతం ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల అభిమానులను సంతోషపరిచేందుకు మోస్ట్ పాపులర్ సర్వేల ద్వారా ఏ హీరో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారనే విషయాన్ని ప్రతినెల తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగా మేల్ స్టార్ సర్వేలో ఫిమేల్ స్టార్ సర్వేలో ఎవరెవరున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Omax సంస్ధ చేసిన ఒక సర్వేలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ సర్వేలు టాప్ లో అగ్ర హీరో విజయ్ దళపతి నిలిచారు. ఇక రెండవ స్థానంలో తెలుగు హీరో ప్రభాస్ ఉండగా.. మూడవ స్థానంలో ఎన్టీఆర్ ,నాలుగవ స్థానంలో అల్లు అర్జున్, ఐదవ స్థానంలో యశ్, ఆరవ స్థానంలో అక్షయ్ కుమార్, ఏడవ స్థానంలో రామ్ చరణ్, ఎనిమిదవ స్థానంలో మహేష్ బాబు, తొమ్మిదవ స్థానంలో సూర్య, పదో స్థానంలో అజిత్ కుమార్ ఉన్నారు. ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్లో తీసుకున్న ఓవర్ మ్యాక్స్ సంస్థ ఈ విషయాలను వెల్లడించింది.

Top 10 Beautiful Tollywood Actress 2022

ఇక హీరోయిన్ల జాబితా విషయానికి వస్తే మాత్రం.. ఫిమేల్ స్టార్స్ జెన్ జాబితాలో సమంత నెంబర్ వన్ గా నిలిచింది. మిగిలిన 9 మందిలో ఆలియా భట్ నయనతార, దీపికా పడుకొనే, రష్మిక ,కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ ,కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క శెట్టి ఉన్నారు.

ఇక మోస్ట్ అవైటేడ్ సినిమాల విషయానికి వస్తే:
ఇందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ముందంజలో ఉంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సలార్, ఆది పురుష్ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి చిత్రాలు ఉన్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానంలోని ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ ,చిరంజీవి, రవితేజ ఉన్నారు.

Share post:

Latest