కొడాలి ప‌న్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్ర‌బాబు…!

ఏదైనా చేస్తే.. దానివ‌ల్ల‌.. పార్టీకి, పార్టీ నాయ‌కుల‌కు ప్ల‌స్ అవ్వాలి. లేదా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మైన‌స్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాల‌కు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ ల‌బ్ధి చేకూరే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. టీడీపీ ప్ర‌స్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విష‌యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై ఆయ‌న నోరు చేసుకున్నా ర‌ని.. పేర్కొంటూ.. టీడీపీ నాయ‌కులు ధ‌ర్నాలు.. రాస్తారోకోలు.. కేసులో హాట్ పుట్టిస్తున్నారు.

Nani Comes Hard At Nimmagadda - Andhrapradesh, Kodali Nani, Nanihard,  Nimmagadda, Tdp Chandrababu, Ysrcpallege - Nani comes hard at Nimmagadda -  Andhrapradesh, Kodali Nani, Nanihard, Nimmagadda, Tdp Chandrababu,  Ysrcpallege

అయితే.. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అస‌లు కొడాలి నాని గురించి తెలిసిన వారు.. లేదా.. ఆయ‌న వ్య‌వ హారంపై అవ‌గాహ‌న ఉన్న‌వారు.. ఆయ‌న ఏం మాట్లాడినా..లైట్ తీసుకుంటున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చేసిన కామెంట్ల‌ను పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఒక‌వేళ ప‌ట్టించుకున్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ప్ర‌జ‌లు కూడా కొడాలి నాని వ్యాఖ్య‌లు వినీ వినీ.. అల‌వాటు ప‌డిపోయారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. దీంతో వారిలోనూ ఎక్క‌డా పెద్ద‌గా రియాక్ష‌న్ ఉండ‌డం లేదు.

కానీ, ఈ విష‌యం తెలిసి కూడా టీడీపీ నేత‌లు.. కొడాలి విష‌యాన్ని పెద్ద ఎత్తున స‌వాల్‌గా తీసుకున్నారు. ఆయ‌న‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. కానీ, కొడాలిపై కేసేమో కానీ.. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపైనే కేసులు న‌మోదు చేశారు. క‌ట్ చేస్తే.. కొడాలి నాని ఇష్యూ ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. కానీ, టీడీపీ చేసిన యాగీ కార‌ణంగా.. ఇప్పుడు నెటిజ‌న్లు.. అస‌లు కొడాలి తాజాగా చేసిన వ్యాఖ్య‌లేంట‌ని తెగ సెర్చ్ చేస్తున్నారు.

TDP won with an immense majority in Kodali Nani's native village -  TeluguBulletin.com

ఫ‌లితంగా చంద్ర‌బాబు కుటుంబంపై కొడాలి నాని క‌నుక ప‌రుష వ్యాఖ్య‌లు చేసి ఉంటే.. ఇప్పుడు మ‌రోసారి చంద్ర‌బాబు ఫ్యామిలీ ప‌రువే పోతుంది. గ‌తంలో నాని, వంశీ చేసిన వ్యాఖ్య‌ల‌ప్పుడు.. చంద్ర‌బాబు క‌న్నీరు పెట్టుకున్నారు. దీనివ‌ల్ల సింప‌తీ వ‌చ్చిందో లేదో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు.. నాటి బాబు క‌న్నీటి సీన్ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి ఆట‌ప‌ట్టిస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనినిబ‌ట్టి.. కొన్ని కొన్ని విష‌యాల‌ను.. కొంద‌రు వ్య‌క్తుల‌ను టీడీపీ ప‌ట్టించుకోకుండా ఉంటేనే బెట‌ర్ అంటున్నారు పార్టీ అభిమానులు.

Share post:

Latest