చరణ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవ్వరో తెలిసిపోయింది… ఫాన్స్ కి జాతరే ఇక!

ఇది చరణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అని చెప్పుకోవాలి. మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇటీవల రిలీజైన RRR సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పేరు ఇండియా అంతటా మారుమ్రోగింది. దాంతో రామ్ చరణ్ తన సినిమాల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేషనల్ స్థాయిలో సబ్జక్ట్స్ ఉన్నట్టు చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ భారీ సినిమాల లైనప్ లో నిన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో చరణ్ ఓ సినిమా చేయనున్నాడని కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై ఓ తుది క్లారిటీ ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చేసింది.

దాంతో చరణ్ మరో దర్శకుడుని లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. ఆ దర్శకుడు మన తెలుగు దర్శకుడు కాదండోయ్. కన్నడ ఇండస్ట్రీ కి చెందిన దర్శకుడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ మఫ్టీ ఫేమ్ దర్శకుడు ‘నర్తన్’ రామ్ చరణ్ ని ఒప్పించినట్టుగా అంటున్నారు. మరి ఈ కాంబో ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ప్రెజెంట్ అయితే చరణ్ శంకర్ తో సినిమాలు బిజీగా ఉండగా నెక్స్ట్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయనున్నాడు.

ఇకపోతే RRR సినిమాతో రామ్ చరణ్ ఒక్క దేశంలోనే కాదు, హాలీవుడ్లో కూడా గుర్తింపు సాధించాడు. ఆమధ్య జేమ్స్ బ్యాండ్ సినిమా సృష్టికర్త రామ్ చరణ్ ని జేమ్స్ బ్యాండ్ క్యారక్టర్ కి సరిపోతాడని పొగిడిన విషయం అందరికీ తెలిసినదే. ఇక చరణ్ తమిళ అగ్ర దర్శకుడు అయినటువంటి ‘శంకర్’ సినిమా చేస్తోన్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా కోసం మెగాభిమానులు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest