మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు నటించిన గాడ్ఫాధర్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్తో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ఇద్దరు హీరోలు బ్రదర్స్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో కేక పెట్టించే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో విక్టరీ వెంకటేష్ కూడా కనపడతాడట.
అయితే రవితేజ, చిరుతో పాటు వెంకీ కూడా ఒకే సినిమాలో కనిపిస్తే ప్రేక్షకులకు అంతకు మించిన పండగ ఉండదు. ఈ సినిమాలో మెగాస్టార్ కి సవతి తల్లి కొడుకు గా రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. ఇక ఇంటర్వెల్లో వచ్చే పాత్రతో రవితేజ ఎంట్రీ ఉంటుందట. ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ నటించబోతుంది.