బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్.. మరో హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే..!

నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.

బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించబోతున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్మెంట్ రావడంతోనే బాలయ్య అభిమానులు ఆనందానికి అవధులు లేవు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చే సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో బాలయ్యకు కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతుందని అనిల్ రావిపూడి ఎప్పుడో చెప్పారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు దర్శకుడు. ఇందులో బాలయ్యకు జోడిగా హీరోయిన్ల విషయంపై ఎప్పుడు నుంచో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. బాల‌య్య‌కు జోడిగా చాలామంది హీరోయిన్‌ల‌ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.. కాగా ఇప్పుడు మరో వార్త ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్ నయనతార నటించబోతుందని తెలుస్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. విరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలను సూపర్ డూపర్ హీట్ అయ్యాయి. మొదటిగా వీళ్ళిద్ద‌రు సింహా సినిమాతో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చారు ఆ సినిమాఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తర్వాత శ్రీరామరాజ్యం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. చివరగా జై సింహా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్‌ను వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు.

Jai Simha Movie Review Rating Story Cast and Crew

ఇప్పుడు మరీ వీళ్లిద్దరూ కలిసి అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటిస్తున్నారు అంటేనేే ఈ సినిమాకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి నయనతారతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం నయనతార భారీగానే రెమ్యూనిరేషన్ అడిగినట్టు కూడా ఒక సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో బాలయ్య అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. మరో హిట్ బాల‌య్య‌కు పడిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest