వావ్: అదే కనుక నిజమైతే..ఇక ఎన్టీఆర్‌ అభిమానులని ఆపలేం రా బాబు..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా నడుస్తుంది. అయితే ఫాన్స్ కూడా ఈ రీ-రిలీజ్ ల‌ సినిమాలకు బ్రహ్మరథం ప‌డుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి` సినిమాతో ఈ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా `తమ్ముడు`, `జల్సా` సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ నటించిన `చెన్నకేశవరెడ్డి` సినిమా విడుదలై 20 సంవత్స‌రాలు అయిన కారణంగా ఈ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

తాజాగా మరో స్టార్ హీరో మూవీ రీ రిలీజ్ సినిమా జాబితాలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం `ఆది` సినిమా కూడా థియేటర్లో సందడి చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. `ఆది` సినిమా వి.వి వినాయక్ డైరెక్షన్లో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా తెరకెక్కింది. అయితే ఈ సినిమా అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్ సాధించింది. `ఆది` విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేస్తోంది.

ఈ విషయంపై నిర్మాత‌ బెల్లంకొండ సురేష్ స్పందించారు. `ఆది` రీ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు.. గత ఏడాది కేవలం ఫ్యాన్స్ షో మాత్రమే వేసినట్టు, ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పుకు వచ్చారు. అయితే `చెన్నకేశవరెడ్డి` రీ-రిలీజ్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని సురేష్ చెప్పారు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ అభిమానులు పట్టరానంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆది రీ రిలీజ్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అని ట్వీట్స్ చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరికెక్కిన ఈ సినిమా అప్ప‌ట్లో 98 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నవంబర్ మూడోవ వారంలో సినిమాను రీ-రిలీజ్ చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంద‌న్న వార్త‌ల‌తో ఎన్టీఆర్ అభిమానుల ర‌చ్చ అయితే స్టార్ట్ అయ్యింది.