జంపింగ్: బాలినేనిపైనే డౌటా?

ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో కొందరు నేతలు…గెలిచే పార్టీని ముందే ఊహించి జంపిగులు చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇలాంటి జంపింగులు సర్వసాధారణమే. గెలుపు ఊపు ఉన్న పార్టీలోకి నేతలు ఎక్కువ వెళ్తారు…అలాగే ఒక పార్టీలో టికెట్ దక్కకపోతే మరొక పార్టీలోకి వెళ్తారు. ఇలా రాజకీయ జంపింగులు మామూలుగానే జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జంపింగులు మళ్ళీ మొదలయ్యేలా ఉన్నాయి..కాకపోతే ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ బలం ఉందో అంచనా వేయలేని పరిస్తితి. అటు వైసీపీ, ఇటు టీడీపీ స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి. మధ్యలో జనసేనకు కూడా ఆదరణ పెరుగుతుంది. దీంతో ఏ నేత ఎటు వెళ్తారో అర్ధం కాకుండా ఉంది.

అయితే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే మాత్రం…ఆ రెండు పార్టీలకు బలం పెరుగుతుడని తెలుస్తోంది. ఇక పొత్తు బట్టి కొందరు నేతలు టీడీపీ లేదా, జనసేనలోకి వచ్చేయొచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో వైఎస్సార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు…వైసీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి రాబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అసలు బాలినేని ఏంటి? జనసేనలోకి రావడం ఏంటి? అందరికీ పెద్ద డౌట్ ఉంది.

అవును బాలినేని..జగన్ ని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళే ప్రసక్తి లేదు…అదే విషయం తాజాగా బాలినేని కూడా చెప్పారు. తనకు వైఎస్సార్ రాజకీయ బిక్ష పెట్టారని, అలాగే జగన్ అండగా ఉంటున్నారని, ప్రాణం పోయిన వైసీపీని వీడేది లేదని చెప్పారు. అసలు పార్టీ మారే విషయంపై బాలినేని క్లారిటీ ఇచ్చే వరకు ఎందుకు వచ్చిందంటే…తాజాగా పవన్ చేనేత వస్త్రాలు ధరించాలనే ఛాలెంజ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ నుంచి స్వీకరించారు.

అలాగే చేనేత ఉత్పత్తులు ఎంకరేజ్ చేయాలని, చేనేత దుస్తులు ధరించాలని పవన్…చంద్రబాబుకు, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ కు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ ని బాలినేని తాజాగా పూర్తి చేశారు. దీనికి పవన్ అభినందలు తెలిపారు. ఇంకా అంతే బాలినేని జనసేనలోకి వెళ్లిపోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అందుకే ఈ విషయంపై బాలినేని సెపరేట్ గా క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్తితుల్లోనూ బాలినేని వైసీపీని వీడే ప్రసక్తి లేదని చెప్పొచ్చు.