తారక్ గురించి విజయ్ అలా మాట్లాడాక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇక రచ్చ రంబోలానే!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్‌లలో సూపర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ హైప్ దేశమంతటా పెంచేలా అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. RRRలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్స్ 2023 నామినేషన్‌లో చోటు దక్కుతుందా అని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘తారక్ అన్న ఆస్కార్ అవార్డు కచ్చితంగా గెలవాలి. అన్నకి అవార్డు వస్తే మెంటల్ ఉంటది. మన కంట్రీ నుంచి మన వాళ్లు గెలిస్తే వచ్చే ఆనందమే వేరు. ఆయనది డెడ్లీ పర్ఫామెన్స్ అసలు.. రామ్ చరణ్ అన్నా, తారక్ అన్నా కిల్లర్ పర్ఫామెన్స్ ఇచ్చారు’ అని కామెంట్స్ చేశాడు.

తారక్ అన్న 5-6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగల బహుభాషావేత్త అని కూడా విజయ్ పొగిడాడు. తారక్ పై విజయ్ అనూహ్యంగా పొగడ్తల వర్షం కురిపించడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. విజయ్ డౌన్ టు ఎర్త్ నేచర్‌ని , నిజాయితీని కొనియాడుతున్నారు. దేవరకొండ నుంచి తారక్‌పై ఇంత పాజిటివ్ మాటలు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు లైగర్ సినిమాకి పాజిటివ్‌గా ప్రచారం మొదలెట్టేసినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తలుచుకుంటే సోషల్ మీడియాలో లైగర్‌కి కావాల్సిన హైప్ ఈజీగా తీయగలరు. మరి వారు దీనిని ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతారో లేదో చూడాలి. లైగర్‌ని చూసేందుకు ఎంతమంది ఎన్టీఆర్ అభిమానులు పోటెత్తారు, సోషల్ మీడియాలో లిగర్‌పై ఎలాంటి రివ్యూలు స్ప్రెడ్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆగస్టు 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని బాయ్ కాట్ చెయ్యాలని ఓ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఆమిర్ ఖాన్‌కు సపోర్టుగా విజయ్ మాట్లాడటమే ఇందుకు కారణం. కానీ సినిమా బాగుంటే ఇలాంటి ట్రెండ్స్ ఎన్ని నడిచినా హిట్ అందుకోవడం పక్కా!