వావ్: ఎన్టీఆర్‌కు జోడీగా ఆ టాప్ హీరోయిన్ ఫిక్స్‌…!

గత కొన్ని సంవత్సరాలుగా జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ గురించి చాలా చర్చ జరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ జాన్వీ కపూర్ ఎంట్రీ గురించి ఎంతవరకు అధికార ప్రకటన రాలేదు. జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ సైతం దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఎవ్వ‌రికి క్లారిటీ లేదు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో రెండో చిత్రం రాబోతుంది. ఎన్టీఆర్ 30వ సినిమాగా వ‌స్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టులో జాన్వీకపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.

డైరెక్టర్ కొరటాల శివ వెళ్లి పలుమార్లు జాన్వీతో కదా చర్చలు జరిగినట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో ఇదంతా అపోహే అయ్యింది. అయితే తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఎన్టీఆర్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక సినిమా ఒకే చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాకు పెద్ద అన్న టైటిల్ కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ సినిమాలో జాన్వీ క‌పూర్ ని హీరోయిన్ గా పెడుతున్నట్టు టాక్ ?

ఎన్టీఆర్ రెండు సినిమాల్లో జాన్వీని హీరోయిన్ అంటున్నా.. క్లారిటీ లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తనకు అది చాలా అదృష్టమని మీడియాతో చెప్పింది. జాన్వీ కామెంట్ల‌తో ఎన్టీఆర్ అభిమానుల్లో ఓ చర్చ జరుగుతుంది. కొరటాల సినిమాలో మిస్సయినా.. ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ నిజంగానే హీరోయిన్‌గా నటిస్తుందని.. అప్పటికి తనకున్న కాల్ షీట్లు సర్దుబాటు అవుతాయని అంటున్నారు.

 

ఇక ఎన్టీఆర్ – జాన్వీ జంట క‌లిసి న‌టిస్తే మామూలు రచ్చ ఉండ‌దు. కొర‌టాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు బుచ్చిబాబు స్క్రిప్ట్ కూడా రెడీ అయిన వెంట‌నే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నట్లు టాక్ ?