పుష్ప: ది రూల్ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు..!

పుష్ప సినిమా భారీ అంచనాలతో విడుదలై అంతకుమించిన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ అదరగొట్టాడు. ఈ మూవీలోని డైలాగులు, బన్నీ మేనరిజం, యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప ది రూల్ సినిమాపై భారత దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ పుష్ప ది రూల్ పైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మూవీ సెకండ్ పార్ట్‌పై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసేలా శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు. పుష్ప రెండో భాగంలో యాక్షన్, ఎలివేషన్ సన్నివేశాలు చాలా అధికంగా ఉంటాయని.. ఎమోషన్స్ కూడా పీక్‌లో ఉంటాయని ఇన్‌సైడ్ టాక్. పుష్ప ది రూల్‌లో శ్రీ వల్లి, భన్వర్ సింగ్ షెకావత్, మంగళం శీను, దాక్షాయణి పాత్రలు కనిపిస్తాయని అంటున్నారు. విజయ్ సేతుపతి మాత్రం కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈ సినిమా అసలైన సర్‌ప్రైజ్‌ సమంత రోల్‌ అని అంటున్నారు. ఈ ముద్దుగుమ్మ రోల్‌ను పొడిగించే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ఈ సినిమాలో ఊ అంటావా పాటతో సమంత ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను అల్లు అర్జున్‌కి సహాయం చేసే ఒక క్యారెక్టర్ గా రూపొందించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు రష్మిక శ్రీవల్లి పాత్ర సినిమా మొదలైన 20 నిమిషాల్లో ముగుస్తుంది. ఆమె లేకపోతే సినిమా అంతా కల తప్పుతుంది. అందుకే అలా జరగకుండా ఆమెను పుష్ప రాజ్ ఆలోచనలలో చివరి వరకు చూపించాలని సుకుమార్ ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అలానే సమంతకు మరింత స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి మూవీలో హీరోయిన్ లేని లోటును భర్తీ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.