సీతారామం నుంచి మరొక అప్డేట్.. ట్విస్ట్ అదిరిందిగా..!

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీతారామం.. ఇకపోతే ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది.ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్న మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీవల్లి పాత్రలో డి గ్లామరస్ పాత్ర పోషిస్తూ తన నటనతో.. అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశంలో కూడా ఈమె నటించిన తీరు ప్రేక్షకులను బాగా మెప్పించి ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా సీతారామం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించడానికి సిద్ధం అవుతుంది.Sita Ramam | Glimpses video of 'Sitarama' with Dulquar and Rashmika Mandana  released on Shri Ram Navami - time.news - Time News

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్ర ఎప్పటిలాగే భిన్నంగా ఉండబోతుందని.. అంతేకాదు రెండు విభిన్నమైన పాత్రలలో ఆమె కనిపించబోతున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు విజువల్స్ ని చూస్తుంటే మనకు అనిపిస్తోంది. ఇకపోతే ఫస్ట్ లుక్ లో ఆమె ఒక ముస్లిం యువతిగా కనిపించింది.. ఇక ఆ తర్వాత హిందూ యువతిగా నార్మల్గా కనిపిస్తున్నట్లు విజువల్స్ కూడా అందుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో రష్మిక రెండు విభిన్నమైన పాత్రలలో మనకు కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక టైం ట్రావెల్ కి సంబంధించిన సినిమా అన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక పాత్ర కూడా రెండు కాలాల్లో ఉంటుందని తద్వారా అక్కడివారికి ఇక్కడి వారికి కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని సమాచారం.Dulquer Salmaan's Sita Ramam gets a release date, makers promise 'a love  story from the pages of history' | Entertainment News,The Indian Express

ఇకపోతే ఈ సినిమా కథ ఏమిటి అనే విషయం తెలియాలి అంటే సినిమా విడుదలయ్యి వరకు క్లారిటీ రాదని చెప్పాలి. ఇక ముఖ్యంగా ఈ సినిమాల్లో రష్మిక మందన పాత్ర చాలా కీలకమట. అందుకే రష్మిక మందన్న కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుందని సమాచారం.. కానీ కొంతమంది మాత్రం హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానంలో ఉన్న రష్మిక హీరోయిన్గా కాకుండా ఇలా కీలక పాత్రలో వహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కానీ ఈ పాత్ర తర్వాత ప్రతి ఒక్కరు ఆమెను మెచ్చుకుంటారు అని వైజయంతి మూవీస్ నిర్మాతలు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.