తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!

బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు ఒకసారి లుక్కేద్దాం.

‘ఒక ఊరిలో’ అనే సినిమాలో గ్లామర్ బాయ్ తరుణ్ క్లైమాక్స్ లో చనిపోతాడు. కాగా ఈ విషయం ప్రేక్షకులకు డైజెస్ట్ కాకపోవడంతో సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అలాగే శోభన్ దర్శకత్వంలో మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం బాబీ. ఈ సినిమా ఎండింగ్ లో కూడా మహేష్ బాబు పాత్ర చనిపోతుంది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా రాజన్న చిత్రంలో నాగార్జున పాత్ర చనిపోతుంది. అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చక్రం. ఈ సినిమాలో కూడా ప్రభాస్ పాత్ర చనిపోతుంది. ఈ సినిమా ప్లాప్ అయింది.

అలాగే ఆంధ్రావాలా, జై లవకుశ , యమదొంగ చిత్రాలలో NTR పోషించిన పాత్రలు చనిపోతాయి. ఆంధ్రావాలా మానహా మిగిలిన రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం గమనార్హం. యమదొంగ విషయంలో రాజమౌళి మ్యాజిక్ పనికొచ్చింది. ఇక భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ, ఈగ, జెంటిల్మెన్, శ్యాం సింగరాయ్ వంటి సినిమాలలో నాని పాత్ర చనిపోతుంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పుకోవాలి. వీరితో పాటు రానా, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, మంచు మనోజ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, అడవి శేషు ఇలా ఈ స్టార్ హీరోలు అందరూ చనిపోయిన పాత్రలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నవారే.

Share post:

Latest