తెలుగు వారికి బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సీజన్ నుండే మనవాళ్ళు దానికి బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు అని అర్ధం అయిపోయింది. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను NTR హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. అలాగే మూడు, నాలుగు, ఐదు సీజన్స్‌ను వరుసగా అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. అలాగే ఇపుడు ఆరవ సీజన్ ని కూడా అతనే హోస్ట్ చేయబోతున్నారు.
ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4వ తేదిన సాయంత్రం 6గంటల నుంచీ ప్రారంభం కాబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు నిజానికి ఆగష్టు చివరి వారంలోనే ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని టాక్ వినబడుతోంది. ఇక ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా యాంకర్ శివ ఉండనున్నారట. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాలో క్లీన్ ఇమేజ్ ఉన్న బుల్లితెర జంట రోహిత్ మెరీనాలను రంగంలోకి దింపబోతున్నారు.
అవును… మెరీనా అబ్రహాం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించగా.. వివాహం అనంతరం హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్లో ప్రసారం అయిన ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్ అయ్యింది మెరీనా. కళ్యాణిగా సీరియల్‌తో పాటు చిన్న చిన్న సినిమాల్లోనూ నటించింది మెరీనా. 2016లో రొమాన్స్ విత్ ఫైనాన్స్ తెలుగు చిత్రంతో హీరోయిన్గా తొలి చిత్రంలో నటించింది. 2017 నవంబర్‌లో మెరీనా.. తన తోటి నటుడు, మోడల్ అయిన రోహిత్ షహ్నీ ని పెళ్లాడింది. యూట్యూబ్ వీడియాలతో కూడా బాగా పాపులర్ అయిన ఈ జంట.. బిగ్ బాస్ సీజన్ 6లో అడుగుపెట్టి గట్టిపోటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
Bigg Boss 6 హౌస్‌లోకి భార్యా భర్తలు వస్తున్నారు.. ఇద్దరిలో ఒక్కరైనా గెలుస్తారా?
