ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ శ్రీనివాసులు.. ప‌రిటాల సునీత‌.. ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి వంటివారు ఉన్నారు.

వారికి తోడు.. జేసీ కుటుంబం ఎలానూ ఉంది. దీంతో టీడీపీకి అత్యంత బ‌లంమైన జిల్లాగా.. అనంత‌రం వుంద‌ని అంద‌రూ అంటున్నారు. కానీ. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నేది వాస్త‌వం. ఎఎక్క‌డా ఏ ఒక్క‌రూ కలిసి ముందుకు సాగుతున్న ప‌రిస్థితి లేదు. అనంత‌పురం అర్బ‌న్ నుంచి ధ‌ర్మ‌వ‌రం వ‌ర‌కు కూడా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య తీవ్ర విభేదాలు వివాదాలు.. తెర‌మీదికివ‌స్తున్నాయి. అంతేకాదు.. ఎవ‌రికి వారు.. సొంత అజెండాలు ఏర్పాటు చేసుకుని.. పార్టీలోని నాయ‌కుల‌పైనే కాలు దువుతున్న ప‌రిస్థితి ఉంది.

ఇక‌, సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ జెండా మోసే నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. ఎం.ఎస్‌రాజు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న రాష్ట్రంలో తిరుగుతున్నార‌నే త‌ప్ప‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డం లేదు. పుట్ట‌ప‌ర్తిలో మాజీ మంత్రి ప‌ల్లె కు వ్య‌తిరేకంగా.. జేసీ వ‌ర్గం మ‌రింత .. దూకుడు పెంచింది. ఇక‌, ప‌రిటాల కుటుంబం.. రెండు టికెట్లు కావాల‌ని.. ప‌ట్టుబ‌డుతుంటే.. చ‌చంద్ర‌బాబు ఒక‌టే న‌ని గ‌త ఎన్నిక‌ల్లో స్ప‌ష్టం చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కావాల్సిందేన‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు. ఇంకోప‌క్క‌, ఉర‌వ‌కొండ‌లో పార్టీ నిర్ణ‌యాల మేర‌కు.. ప‌య్యావుల కేశవ్ ఆందోళ‌న అయితే.. చేస్తున్నారు.

అనంత' టీడీపీలో అనంత భయాందోళనలు! - MicTv.in - Telugu News

కానీ.. ఇక్క‌డ ప్ర‌జ‌లు మాత్రం అభివృద్ధి కోరుకుంటున్నారు మ‌రోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే బాల‌య్య గురించి.. ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిదనే టాక్ వినిపిస్తోంది… ఇదే పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపొయిన సీనియ‌ర్ నాయ‌కుడు నిమ్మ‌ల కిష్ట‌ప్ప అడ్ర‌స్ లేరు. జేసీ దూకుడు వ్య‌క్తిగతానికే త‌ప్ప‌.. పార్టీకి ఏమాత్రం ఉప‌యోగ ప‌డ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది ఇన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో అనంత‌పురం అనే బ‌ల‌మైన కంచుకోట‌లో సైకి ల్ ప‌రుగులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంత ఈజీకాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share post:

Latest