మామ కు కోడలు పిల్ల అద్దిరిపోయే సర్ ప్రైజ్..మెగా హీరోలు కూడా షాక్..!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవి ఒకరు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. దీంతో పాటు అంతకు ముందు రోజు వేలాదిగా తరలివచ్చిన మెగా అభిమానులతో మెగా కార్నివాల్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌ని మెగా అభిమానులు గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతోపాటు చిరంజీవికి సిని, రాజకీయ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు తమ సోషల్ మీడియా ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ రోజు కొణిదల ఫ్యామిలీ పెద్ద కోడలు… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదల, మామ‌య్యకు ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేను మీ అందరితో పోలిస్తే సోషల్ మీడియా ద్వారా మావ‌య్యకు జన్మదిన శుభాకాంక్షలు లేటుగా చెప్తున్నాను అని కొంచెం ఎమోషనల్అ య్యారు. దానికి కారణం తామందరం ఆయన పుట్టినరోజుని ఒక పండగలా చేసుకుంటామని అన్నారు.

A peek into Megastar Chiru's house 2.0- The New Indian Express

ఆయన పుట్టినరోజు మా జీవితాల్లో మెమొరబుల్ రోజులాగా మిగిలిపోతుందన్న‌ ఉపాసన … హ్యాపీ బర్తడే మావ‌య్య అంటూ మెగాస్టార్ తో పాటు ఆయన సతీమణి సురేఖతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. ఇక ఎప్పుడు ఆ పోస్ట్ ను మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా ఉపాస‌న లేటుగా మామ చిరుకు బ‌ర్త్ డే విసెష్ చెప్పినా లేటెస్టుగా చెప్పార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.