క్లైమాక్స్ లో ఆ ట్విస్టే హైలెట్.. బాలయ్య మూవీ నుంచి ఇంట్రెస్టింట్ అప్ డేట్..

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ కెరీర్ లో ఇంది 107వ చిత్రం.. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింట్ అప్ డేట్ వినిపిస్తోంది.. సినిమా క్లైమాక్స్ లో హైలెట్ ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తోంది.. ఈ సినిమా క్లైమాక్స్ లో బాలయ్య క్యారెక్టర్ కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని, సినిమా మొత్తంలో ఇదే పెద్ద హైలెట్ గా ఉంటుందని టాక్..

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.. ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపీచంద్ మలినేని గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి హిట్ చిత్రాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బాలయ్యతో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంత మంది నటులను ఎంపిక చేసుకున్నారు. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి స్టార్స్ ఉన్నారు.

ఇక ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్నిరోజులుగా రూమర్స్ ఎక్కవ అవుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 23న విడదుల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. మరీ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే.. విడుదల అయ్యే దాకా ఆగాల్సిందే..

Share post:

Latest