ఏపీ, తెలంగాణ‌లో శృంగార స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలివే…!

అవును.. మీరు విన్నది నిజమే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే – 5లో భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. శృంగారం విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని మగాళ్లు చాలా రసికులని తేలింది. ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ తాజాగా వెలుగు చూసింది. అవును… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మగవాళ్లు ఆడవారి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో 1.1 లక్షల మంది మహిళలు, 1 లక్ష మంది మగవాళ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో 2019 నుంచి 2021 వరకు చేసిన ఈ సర్వేకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు. తెలంగాణలో మహిళలు సగటున 1.7 మందితో సెక్స్‌ చేయగా పురుషులు మాత్రం ముగ్గురితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక ఏపీలో మహిళలు 1.4 మందితో, పురుషులు 4.7 మందితో శృంగారం జరుపుతున్నారని తేలింది. దేశవ్యాప్తంగా చూస్తే మేఘాలయ, సిక్కింలో పురుషులు 9.6 మందితో సెక్స్ చేస్తుండగా.. మూడో స్థానంలో ఏపీ (4.7) ఉండటం కొసమెరుపు.

ఇక దేశం మొత్తంలో చూసుకుంటే పురుషులు సగటున 7.1 మంది పార్ట్‌నర్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకే లైంగిక భాగస్వాములు ఎక్కువగా ఉన్నారట. ఈ రాష్ట్రాల్లో భర్త లేదా సహ జీవనం చేస్తున్న వ్యక్తితో కాకుండా ఇతరులతో మహిళలు ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటున్నట్లు తేటతెల్లం అయింది. రాజస్థాన్, హర్యానా, చండీఘర్, జమ్ము అండ్ కశ్మీర్, లద్దాక్, మధ్యప్రదేశ్, అస్సోం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లోని మహిళలకు పురుషుల కంటే ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.