బాలీవుడ్ అందాల భామ కియర అద్వానీ గురించి అందరికి తెలిసిందే. ఈమె తెలుగులో మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియరా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే.
గతంలో వీరిద్దరూ షేర్షా అనే సినిమా కలిసి చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు బయటికిచ్చాయి. అయితే ఈ వార్తలపై కియరా ఎప్పుడు స్పందించలేదు.
తాజాగా కియరా కాఫీ విత్ కరణ్ షో కి వెళ్లారు. ఆ షోలో తనపై వచ్చిన వార్తలపై స్పందించింది. అయితే ఇప్పుడు తను ఏం మాట్లాడిందనే దానిపై సోషల్ మీడియాలో తెగ సెర్చింగ్ జరుగుతుంది.
కియారా ఇచ్చిన ఆన్సర్ కోసం నెటిజన్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ కియారా ఏం చెప్పిందంటే… సిద్ధార్థ్ మల్హోత్రా.. నేను మంచి స్నేహితులమని చెప్పింది. మా ఇద్దరి మధ్య అంతకుమించి ఏమీ లేదని కియరా క్లారిటీ ఇచ్చింది.
View this post on Instagram