టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?

రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపారు.

మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఏ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందా? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది…పైగా ఈ సారి జిల్లాల విభజన జరిగింది..13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. అంటే జిల్లాలో ఉండే నియోజకవర్గాలు తగ్గాయి. అలాంటప్పుడు ఈ సారి క్లీన్ స్వీప్ జిల్లాలు పెరగవచ్చు. కాకపోతే గత ఎన్నికల మాదిరిగా వైసీపీ వేవ్ ఉంటే…పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసేది. కానీ ఇప్పుడు నిదానంగా వైసీపీ వేవ్ తగ్గుతుంది. మరి ఎన్నికలనాటికి పరిస్తితి ఎలా ఉంటుందో చెప్పలేం.

అలా అని వైసీపీకి కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వైసీపీకి పట్టున్న జిల్లాల్లో టీడీపీ ఒక సీటు గెలుచుకునా సరే క్లీన్ స్వీప్ జరగదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో టీడీపీకి ఒక సీటు గెలుచుకునే కెపాసిటీ ఉందని చెప్పొచ్చు.

అదే సమయంలో నెక్స్ట్ టీడీపీ-జనసేన పొత్తు గాని ఫిక్స్ అయితే…కొన్ని జిల్లాల్లో ఈ రెండు పార్టీలు కలిసి క్లీన్ స్వీప్ చేయొచ్చు. ఆ రెండు పార్టీలు కలిస్తే క్లీన్ స్వీప్ అవకాశం ఉన్న జిల్లాలు వచ్చి…బాపట్ల, గుంటూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖపట్నం. ఈ జిల్లాల్లో టీడీపీ-జనసేన కలిసి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.