కళా వారసుడుకు బ్రేకులు?

రాజకీయాల్లో ఏ సీనియర్ నాయకుడైన తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్ లో పెట్టాలని అనుకుంటారు. ప్రతి నాయకుడు తమ వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావలనే చూస్తారు. ఇప్పటికే చాలామంది నేతలు…తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో కొందరు నేతల వారసులు మంచి మంచి విజయాలు అందుకోగా, మరికొందరు విజయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదే క్రమంలో తమ వారసుడుని కూడా తీసుకొచ్చి, సీటు ఇప్పించుకుని విజయం దిశగా నడిపించాలని టీడీపీ సీనియర్ కళా వెంకట్రావు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజకీయాలో కళా చాలా సీనియర్ నేత..టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మధ్యలో ఈయన చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్ళి రాజకీయంగా విఫలమయ్యారు.

మళ్ళీ వెంటనే టీడీపీలోకి వచ్చి…2014లో ఎచ్చెర్ల నుంచి నిలబడి విజయం సాధించి…చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు…అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా పనిచేశారు. అయితే సరిగా పనిచేయకపోవడంతో కళాని తప్పించి ఆయన ప్లేస్ లో అచ్చెన్నాయుడుని అధ్యక్షుడుగా పెట్టారు. అక్కడ నుంచి కళా పెద్దగా కనిపించడం లేదు. పూర్తిగా ఆయన నియోజకవర్గానికే పరిమితమైనట్లు తెలుస్తోంది.

అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో తన తనయుడు రామ్ మల్లిక్ నాయుడుకు సీటు ఇప్పించుకోవాలని ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే మొదట్లో కళా నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో ఎచ్చెర్లలో కలిశెట్టి అప్పలనాయుడు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఇక కలిశెట్టి బలం పెరుగుతున్న నేపథ్యంలో కళా దూకుడు పెంచారు…తన తనయుడు కోసం ఎచ్చెర్లలో యాక్టివ్ గా తిరగడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలోనైనా పాల్గొంటున్నారు. కార్యకర్తలతో టచ్ లో ఉంటున్నారు.

ఇదంతా తన తనయుడు కోసమే అని తెలుస్తోంది…నెక్స్ట్ ఎచ్చెర్ల సీటు ఇప్పించుకోవడం కోసమే ఇప్పుడు దూకుడుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కానీ కళా వారసుడుకు సీటు ఇచ్చే విషయంలో బాబు సుముఖంగా ఉన్నట్లు లేరని తెలుస్తోంది. దీంతో ఎచ్చెర్లలో కళా వారసుడుకు పోటీకి దిగడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.