మ‌హాన‌టి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్‌ను అందుకే ప‌క్క‌న పెట్టారా… ఇంత క‌థ న‌డిచిందా…!

ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఇక ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదని చెప్పాలి. వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే మరొక పక్క లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత కొంతకాలం అడప దడపా సినిమాలు చేస్తూ తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది.Mahanati Review, Savitri Biopic Review Rating, Public Talkఇదిలా ఉండగా మహానటి సినిమా కోసం ప్రధాన పాత్రలో మలయాళం నటిని తీసుకున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆమె కొన్ని షరతులు పెట్టడం వల్లే కీర్తి సురేష్ కు ఆఫర్ లభించింది అని సమాచారం. ఇకపోతే ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వెల్లడించారు. ఆయన ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ముందుగా మహానటి సినిమా తెరకెక్కించేటప్పుడు.. ప్రధాన పాత్ర కోసం మలయాళం హీరోయిన్ అనుకున్నాము. ఇక ఆమె ఈ సినిమా చివర్లో హీరోయిన్ తాగుడుకు బానిసపడ్డ అమ్మాయిగా కనిపించాలి. అదే సావిత్రమ్మ జీవితంలో జరిగిన విషయాలను చూపించే క్రమంలో ఈ సన్నివేశాలను కూడా జోడించాము.. అయితే ఆ మలయాళ హీరోయిన్ మందు తాగే సన్నివేశాలు ఉంటే వెంటనే తీసేయండి. ఉంటే నేను చెయ్యను అని కండిషన్ పెట్టింది. అందుకే ఆ హీరోయిన్ ను తీసుకోవద్దని నేను చెప్పాను. ఇక తర్వాత కీర్తి సురేష్ ను ఎంపిక చేయడం జరిగింది అంటూ అశ్వినీ దత్ వెల్లడించారు.Nithya Menon scared of comparison?

అయితే మలయాళం హీరోయిన్ ఎవరనే విషయాన్ని అశ్విని దత్త వెల్లడించలేదు. మహానటి సినిమాకు ఆయన కూతుర్లు నిర్మాతలు వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇకపోతే అప్పట్లో నిత్యమీనన్ ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేసిందని వార్తలు వైరల్ అయ్యాయి.