బాబు-పవన్ సైలెంట్ స్కెచ్..కలిసే?

ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఏపీలో అధికారం మళ్ళీ వైసీపీదే అని చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరొకసారి వైసీపీ అధికారం దక్కించుకోవడం గ్యారెంటీ అని సర్వేలు నిరూపిస్తున్నాయి…కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి భారీ మెజారిటీ రావడం మాత్రం కష్టమని తేలిపోతుంది…అదే సమయంలో టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కానీ అధికార వైసీపీని దాటడం టీడీపీకి కష్టమైపోతుంది.

అలాగే జనసేన కూడా కాస్త బలం పుంజుకుంది..అలా అని ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది ఆ పార్టీకి వస్తే ఓ నాలుగైదు సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. సరే మొత్తం మీద చూసుకుంటే వైసీపీకే ఎడ్జ్ ఉంది. ప్రతి సర్వేలోనూ అదే తేలుతుంది…కానీ ఇక్కడ ఇంకో అంశం కూడా ఉంది…సర్వేలు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేది చెప్పడం లేదు. రెండు పార్టీలు విడిగాపోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సర్వేల్లో తెలుస్తుంది.

కానీ రెండు కలిసి పోటీచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనేది సర్వేల్లో రావడం లేదు. అయితే రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ ఉంటుందని మాత్రం అర్ధమవుతుంది. రెండు పార్టీలు కలవడంవల్ల వైసీపీకి అధికారం దూరమయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయి.పొత్తు లేకపోతే రెండు పార్టీలు నష్టపోవడంతో పాటు…వైసీపీకి లాభం చేకూరుతుందని తెలుస్తోంది. కానీ పొత్తు ఉంటే మాత్రం రెండు పార్టీలు లాభపడటమే కాదు…వైసీపీకి చెక్ పెట్టొచ్చని అంటున్నారు. అంటే టీడీపీ-జనసేన కలిస్తేనే వైసీపీని అధికారానికి దూరం చేయగలవు.

అయితే ఈ విషయంపై అటు చంద్రబాబుకు గాని, ఇటు పవన్ కల్యాణ్ కు గాని అవగాహన ఉందని తెలుస్తోంది. కాకపోతే పొత్తు విషయంలో ఇప్పుడే బయటపడకూడదని ఇద్దరు నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు విడిగా రాజకీయం చేస్తూ బలం పెంచుకుని, సరిగ్గా ఎన్నికలముందు పొత్తు తప్పనిసరిగా పెట్టుకోవాలని బాబు-పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకోవడం కోసమే ఇప్పుడు సైలెంట్ గా పొత్తు బయటపడకుండా రాజకీయం చేస్తున్నట్లు అర్ధమవుతుంది.