మోదీతో మరోసారి..ఈ సారి తేల్చేస్తారా?

ఎట్టకేలకు బీజేపీకి దగ్గరవ్వాలనే చంద్రబాబు కోరిక నెరవేరేలా ఉంది..గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఏదొరకంగా బాబు…బీజేపీకి దగ్గరవ్వడానికే చూశారు. తనకు కలిసొచ్చిన ప్రతి అంశాన్ని బీజేపీకి దగ్గరయ్యేందుకు వాడుకున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా…బాబుని మాత్రం దగ్గర చేసుకునేది లేదని బీజేపీ తేల్చి చెబుతూనే వచ్చింది. కానీ తాజాగా మోదీని బాబు కలవడం సంచలనంగా మారింది. ఆజాదీకా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళిన బాబు…మోదీని కలిశారు…ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

దీంతో మళ్ళీ బీజేపీకి బాబు దగ్గరైపోయారని, బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం మొదలైంది. అలాగే తెలంగాణలో బీజేపీకి లబ్ది చేకూర్చేలా బాబు ఒప్పందం చేసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఇటు ఏపీలో తమకు సహకరించాలని బాబు..మోదీని కోరినట్లు చెప్పారు. అయితే ఇదంతా వైసీపీ చెప్పిన స్టోరీ.. ఇక బాబు అసలు మోదీ ఏం మాట్లాడారో…తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించారు.

ఢిల్లీలో జరిగిన కార్యంరామంలో ప్రధాని ఒక్కొక్కరినీ పలకరిస్తూ తన వద్దకు వచ్చారని, మనం కలిసి చాలా రోజులైందని, ఢిల్లీ రావడం లేదా అని అడిగారని, దానికి సమాధానంగా… ఢిల్లీలో తనకు పనేమీ లేదని, రావడం లేదని చెప్పానని బాబు వివరించారు. అలాగే మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని, మనం ఒకసారి కలవాలని మోదీ అన్నారని, తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని చెప్పానని బాబు జరిగిన మ్యాటర్ చెప్పుకొచ్చారు. అలాగే ఒకసారి వీలు చూసుకుని ఢిల్లీ రావాలని, వచ్చే ముందు తన కార్యాలయానికి సమాచారమిస్తే, సమయం చూసుకుని కలుద్దామని మోదీ…బాబుతో అన్నారట. తాను కూడా సరే అన్నానని బాబు చెప్పుకొచ్చారు.

ఇది బాబు-మోదీ మధ్య జరిగిన స్టోరీ…అంటే దీని బట్టి చూస్తే…మళ్ళీ బాబు..మోదీతో భేటీ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఒకవేళ ఈ మాటలు నిజమైతే…మోదీ అపాయింట్మెంట్ ఇస్తారు…అలాగే బాబు కలుస్తారు. అప్పుడు పొత్తుపై ఏదైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

Share post:

Latest