సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే సెంటిమెంటు ఉంది.

ఇది వాస్త‌వం కూడా.గ‌తంలో స్పీక‌ర్‌గా ప‌నిచేసిన నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు గెల‌వ‌లేదు. కిరణ్ కుమార్ రెడ్డి అస‌లు పోటీకే దూరంగా ఉన్నారు .ఆర్‌. సురేష్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇంతే. అయితే.. ఆయ‌న పార్టీ మారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇక‌, మిగిలిన వారిలోనూ ఇదే ప‌రిస్థితి నెలకొంది. దీంతో అంద‌రూ .. కూడా స్పీక‌ర్ ప‌ద‌వి త‌ర్వాత‌.. త‌మ‌కునామినేట్ ప‌ద‌విని ముందుగానే మాట్లాడుకుని.. అప్పుడు స్పీక‌ర్ ప‌ద‌వులు తీసుకుంటున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Andhra Pradesh: Guidelines issued on allocation of personnel

ఏపీ విష‌యానికి వ‌స్తే.. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు త‌మ్మినేని సీతారామ్‌.. స్పీక‌ర్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్ని క‌ల‌కు సంబంధించి ఆయ‌న కూడా బెంగ పెట్టుకున్నారు. దాదాపు మూడు సార్లుగా ఓడిపోతున్న ఆయ‌న‌.. గ‌త ఎన్నిక‌ల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యంద‌క్కించు కున్నారు. అయితే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు జంకుతున్నారు. దీంతో ఆయ‌న ఇప్ప‌టికే నామినేటెడ్ ప‌ద‌విని రిజ‌ర్వ్ చేసుకున్నార‌ని అంటున్నారు.

Speaker Tammineni Sitaram orders foolproof arrangements

అదే స‌మ‌యంలో త‌న సీటును త‌న కుమారుడు నాగార్జునకు కేటాయించేలా కూడా అధిష్టానాన్ని ఒప్పిం చార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తే.. ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని అనుకున్న ఆయ‌న‌.. త‌న కుమారుడికి టికెట్ ఇప్పించుకోవ‌డంతోపాటు.. త‌న‌కు కూడా ప‌నిలో ప‌నిగా ఒక నామినేటెడ్‌ బెర్త్‌ను ఖ‌రా రు చేసుకున్న‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది. సెంటిమెంటు విష‌యాన్ని సీఎం జ‌గ‌న్‌కు చెప్ప‌గానే ఆయ‌న అంగీక‌రించార‌ని.. ఈ నేప‌థ్యంలో త‌మ్మినేని కోరిక‌లను నెర‌వేర్చార‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

CM YS Jagan Mohan Reddy Called Speaker Wife As Steel Lady - Sakshi

 

Share post:

Latest