చిరంజీవిపై యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్… అలా జరిగిందట!

మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ అద్భుతం. తెలుగు తెరపై క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అశేషజనాభిమానాలను సొంతం చేసుకున్న అగ్రనటుడు. నేడు మెగాస్టార్ అనే వృక్షఛాయలో ఓ అరడజనకు పైగా హీరోలు తయారయ్యారు అంటే అర్ధం చేసుకోండి. రాబోయే తరాలకు ఓ రూట్ ని ఏర్పాటు చేసారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు ధీటుగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

చిరంజీవికి సంబంధించిన ఎలాంటి విషయం బయటకి వచ్చినా సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. ఆన్ లైన్ మాధ్యమాలపై ఎక్కడ చూసినా మెగా ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజున ట్విట్టర్ లో శుభాకాంక్షల మోత మోగింది. అయితే దీనిపై ఓ నెటిజన్ ఆసక్తికరంగా రియాక్ట్ అవుతూ తన ఫీలింగ్ అందరి ముందు పెట్టేశాడు. ఇందులో గట్టిగా “మెగాస్టార్” అని అరిచే ఆప్షన్ లేదు కానీ.. ఉంటే ఫ్యాన్స్ ఇచ్చే ఆ సౌండ్ కి ట్విట్టర్ పెలిపోయేది అని కామెంట్ వదిలాడు. ఇది చూసి అనసూయ రియాక్ట్ కావడం ఇక్కడ విశేషం.

కదా!!! అంటూ సింపుల్ గా అది నిజమే అని చెప్పింది ఈ జబర్దస్త్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఫొటోస్, మెసేజెస్ పెట్టే అవకాశం ఉంది కానీ అరిచే ఆప్షన్ లేదుగా ఉంటే ఆ మోత వేరేలా ఉండేదనేది సదరు నెటిజన్ ఫీలింగ్. దీనికి అనసూయ కూడా ఎస్ అనడంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. చిరంజీవి అంటే ఎంతో ఇష్టపడే అనసూయ.. ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ పాత ఫోటో ఒకటి షేర్ చేస్తూ బెస్ట్ విషెష్ అందించింది. చిరుపై ఉన్న అభిమానాన్ని పదాల రూపంలో వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసింది అనసూయ. ఇకపోతే రీసెంట్ గానే జబర్దస్త్ వీడిన అనసూయ.. ప్రస్తుతం స్టార్ మాలో సూపర్ సింగర్ ప్రోగ్రాం చేస్తోంది. దీంతో పాటు వరుస సినిమాలకు కమిట్ అవుతూ వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటోంది.