ఆంటీ ఆంటీ అన‌సూయ‌… తోలుతీస్తా అంటూ రెచ్చిపోయిందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా అనసూయకు సూపర్ క్రేజ్ వచ్చింది. అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రతో ఫుల్ పాపులర్ అయింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌కు కోపం వ‌చ్చింది. త‌న‌ను, త‌న ఫ్యామిలీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది.

Anasuya Bharadwaj - Glam Actress

శుక్ర‌వారం ఆమె చేసిన ట్వీట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాపై అన్న టాక్ రావ‌డంతో విజ‌య్ ఫ్యాన్స్ అన‌సూయ‌ను గ‌ట్టిగా టార్గెట్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన అనసూయ ఇలాంటి వివాదాల్లోకి నా ఫ్యామిలీని తీసుకువ‌స్తే మిమ్మల్ని జైలుకి పంపాల్సి ఉంటుందని.. ఇలాంటి పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి అకౌంటు స్క్రీన్ షాట్ తీసుకొని పోలీస్ కేసు పెడతా… ఇదేనా చివరి వార్నింగ్ అంటూ ట్విట్‌ చేశారు. తాను ఫ్యాన్స్ వెన‌కాల దాక్కునే పిరికిదాన్ని కాద‌ని… ఫేక్ అక్కౌంట్లు క్రియేట్ చేసి నాపై ఎన్నో యేళ్లుగా నెగ‌టివ్ ప్ర‌చారం చేస్తున్న విష‌యం నాకు తెలియ‌దా ? అని కూడా ప్ర‌శ్నించింది.

Anasuya Bharadwaj Latest Photos - Sakshi

ఇక న‌న్ను ఎంత తిట్టినా ఆ ట్వీట్లు అన్ని కూడా మీ హీరో ఖాతాలోకే వెళ‌తాయ‌ని కూడా చెప్పింది. ఆమె పెట్టిన పోస్ట్ కు నెటిజెన్లు స్పందిస్తూ. మా అభిమాన హీరో నీ భర్తనే ఆంటీ.. అని కామెంట్లు చేయడంతో అనసూయ ఈ విధంగా వరుస పోస్టులు వేశారు. stay not to online abuse అనే ట్యాగ్ లైన్ తో అనసూయ సోషల్ మీడియా ద్వారా వచ్చిన అందరికీ సమాధానం ఇస్తానని ఆమె సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసింది.

Vijay Devarakonda's surprise offer to Anasuya

Share post:

Latest