‘బింబిసార’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

నందమూరు కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దూసుకుపోతోంది.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంతుదోంది.. జనాలను థియేటర్స్ కి రప్పించడంలో బింబిసార సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఈ సినమా సెలబ్రెటీల నుంచి ప్రశంసలలు అందుకుంటోంది.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పందించారు. బింబిసార సినిమాకు ఆయన సాలిడ్ రివ్యూ కూడా ఇచ్చేశారు.

‘ముందుగా ఆయన సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఇది చాలా ఇంట్రస్టెంగ్ ఫాంటసీ సినిమా అని, కళ్యాణ్ రామ్ చక్కగా నటించారని తెలిపారు. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం చేస్తున్నందున, కొత్త తరహా సినిమాలు తీసుకొస్తున్నందుకు ఆయన అంటే తనకు గౌరవమని చెప్పుకొచ్చారు. అలాగే మొదటి సినిమానే సూపర్బ్ గా హ్యాండిల్ చేసిన కొత్త దర్శకుడు వశిష్టని అభినందించారు. బింబిసార అన్ని వయసుల వారిని ఎంటర్ టైన్ చేస్తుందని అల్లు అర్జున్ రివ్యూ అందించారు.

కాగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మహా చక్రవర్తి బింబిసారుడు పాత్రలో నటించారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టైమ్ ట్రావెల్ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.20 కోట్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో రూ.16.5 కోట్లు వచ్చాయి. ఈ ఆదివారం బ్రేక్ ఈవెన్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share post:

Latest