వైసీపీలో వారసులు ఎంట్రీ..లక్ ఎవరికి?

మెరుగైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వను…ఇది తాజాగా వైసీపీ వర్క్ షాప్ లో సీఎం జగన్ చేసిన కామెంట్. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలని ప్రజల్లోకి పంపించిన విషయం తెలిసిందే. తాను ప్రజలకు అనేక పథకాలు అందించానని, వాటిని ప్రజలకు సవివరంగా వివరించి…ప్రజల మద్ధతు ఇంకా పెంచుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్…ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే.

అయితే ఈ గడప గడపకు కార్యక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పాల్గొవడం లేదని తెలిసింది. స్వయంగా సీఎం జగన్…ప్రజల్లోకి వెళ్లని ఎమ్మెల్యేల పేర్లు చెప్పారు. సగం పైనే ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విఫలమయ్యారని తెలిసింది. ఇక ఇప్పటినుంచైనా ప్రజల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు…ప్రజా మద్ధతు పెంచుకోవాలని లేదంటే…నెక్స్ట్ ఎన్నికలో సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు.

ఇక ఇదే క్రమంలో సీటు డౌట్ అనుకునే ఎమ్మెల్యేలు…అలాగే ఇంకా నెక్స్ట్ గెలుపు డౌట్ అనుకునే ఎమ్మెల్యేలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో చాలామంది నేతల వారసులు రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇక వారికి ఎలాగైనా నెక్స్ట్ సీటు ఇప్పించుకోవాలని నేతలు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కొంతమంది నేతల వారసులు బరిలో దిగిన విషయం తెలిసిందే.

CM YS Jagan In Gadapa Gadapaki Mana Prabhutvam Workshop - Sakshi

ఇక ఈ సారి ఎన్నికల్లో మరికొందరు పోటీకి దిగాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయులు పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని వారసుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించేశారు. అలాగే రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తనయుడు సైతం నెక్స్ట్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇటు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా…తన కుమార్తె ఫాతిమాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు. అటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం..తాను నెక్స్ట్ బరిలో ఉండనని, తన కుమారుడుకు సీటు ఇవ్వాలని జగన్ ని కోరినట్లు తెలుస్తోంది.  అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి లాంటి నేతలు సైతం వారసులని రెడీ చేస్తున్నారు. మరి సీఎం జగన్..ఈ వారసుడుకు సీటు ఇస్తారో చూడాలి.