అక్కినేని బ్రదర్స్ కోసం శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడా?

అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సేవలు అందించిందో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాని ఏలుతున్నవేళ అక్కినేని నాగేశ్వరరావు తనదైన మార్కుతో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. కానీ ఎన్టీఆర్ అంత మాస్ ఇమేజ్ ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేకపోయారు. అతని తరువాత నాగార్జున అతని వారసుడిగా అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే చిరంజీవి సినిమాలలో ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. నాగార్జున తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవిలా మాస్ ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు.

అదే మరలా రిపీట్ అవుతుందా?

కింగ్ నాగార్జున తరువాత అతని వారసులు అయినటువంటి నాగ చైతన్య – అఖిల్ టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. నాగచైతన్య ఇప్పటికే ఓ క్లాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇంచుమించు అన్ని జానర్లని టచ్ చేసాడు. కానీ తెరపై లవర్ బోయ్ గా మేజిక్ చేసిన చే కమర్షియల్ హీరోగా మాత్రం ఎలాంటి మేజిక్ చేయలేకపోయాడు. దాంతో చే కూడా తాత, నాన్నలాగా ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని మాత్రమే రంజింపజేస్తున్నాడు. అయితే తన ఫ్యామిలీ వున్న బలహీనత దృష్ట్యా నాగార్జున తన వారసులతో ఒక్కరినైనా మాస్ కి చేరువ చేయాలని ఎదురు చూస్తున్నాడు.

మరి శ్రీకాంత్ ఏం చేయబోతున్నాడు?

శ్రీకాంత్ అంటే హీరో శ్రీకాంత్ అనుకోకండి. డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈమాట బయటకు రాగానే అక్కినేని అభిమానులు ఒకింత అసహనానికి గురి అవుతున్నారు. ఎందుకంటే బేసిగ్గా క్లాస్ ఆడియన్స్ కోసం సినిమాలు తీసే శ్రీకాంత్ అడ్డాల మాస్ సినిమాను తీసి తమ హీరోల ఇమేజ్ పెంచగలడా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నాగ చైతన్య-అఖిల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టకుని కథని మల్టీస్టారర్ మౌల్డ్ చేయమని నాగార్జున శ్రీకాంత్ కి చెప్పారట. ఇద్దరితో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైననర్ అయితే బాగుంటుందని భావించిన శ్రీకాంత్ ఇప్పుడు మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిస్తోంది.