అడ్డంగా బుక్ అయిపోయిన ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే…!

ఒక నాయ‌కుడు ఎంత వ‌ర‌కు ఉండాలో .. అంత వ‌ర‌కు ఉంటే .. ఎలాంటి స‌మ‌స్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే స‌మ‌స్య‌. అంతా తానే అయిన‌ట్టు.. అధిష్టానం ద‌గ్గ‌ర త‌న‌కు ప‌లుకుబడి ఉన్న‌ట్టు.. నాయ‌కులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా ప‌రిస్థితి మారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఆయ‌న పేరు ఎత్తితేనే మండిప‌డుతున్నారు. మ‌రి ఏం జ‌రిగింది? అంటే..

గ‌త వైసీపీ ప్లీన‌రీకి ముందు.. నియోజ‌క‌వ‌ర్గ, జిల్లా స్థాయిలో ప్లీన‌రీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాలోనూ ప్లీన‌రీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ద‌ర్శి ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణు గోపాల్‌.. త‌న‌ను న‌మ్ముకుని .. పార్టీలో చాలా మంది ప‌నులు చేయించార‌ని.. వారికి ప్ర‌భుత్వం నుంచి 100 కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉంద‌ని.. చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు కూడా ఇదే అభిప్రాయం వెల్ల‌డించారు. పనులు చేసిన వారికి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే.. ఎలా అని నిల‌దీశారు.

దీనిపై వెంట‌నే జోక్యం చేసుకున్న క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌.. తాను హామీ ఇస్తున్నాన ని.. మ‌రో 15 రోజుల్లోనే నిధులు వ‌స్తాయ‌ని అన్నారు. అంతేకాదు.. ప‌నులు ఆపొద్ద‌ని.. ప‌నులు కొన‌సాగించా ల‌ని.. ప్ర‌తి రూపాయికీ.. తాను బాధ్య‌త వ‌హిస్తాన‌ని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు ఈవిష‌యంలో సంబం ధం లేదు. కానీ, జోక్యం చేసుకుని హామీ ఇచ్చారు. అయితే.. ఆయ‌న చెప్పిన‌ట్టుగా.. 15 రోజుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు.

దీంతో ఇప్పుడు నాయ‌కులు, వైసీపీ కాంట్రాక్ట‌ర్లు అంద‌రూ కూడా బుర్రా ఇంటికి క్యూ క‌డుతున్నారు. “అ న్నా.. నీకున్న ప‌లుకుబ‌డి వినియోగించి.. మాకు బ‌కాయిలు ఇప్పించు“ అంటూ.. వేడుకుంటున్నారు. అయితే.. బుర్రా ఏ ఉద్దేశంతో అన్నా.. ఇప్పుడు ఆయ‌న చుట్టూ నాయ‌కులు తిర‌గ‌డం.. జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి దాకా ఈ విష‌యం చేరిపోవ‌డంతో.. బుర్రా దూకుడుపై గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. అస‌లు అధిష్టానం దగ్గ‌ర అంత ప‌లుకుబ‌డి ఉంటే.. ఇంత‌సేపు ఏం చేశార‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి ఆ ఎమ్మెల్యే అలా చిక్కుకున్నారనే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.