OTT ఆసియాలోనే కింగ్ కాబోతుందా? భవిష్యత్ లో థియేటర్లు పూర్తిగా మూతపడిపోతాయా?

ఈ ప్రపంచం కరోనాకి ముందు తరువాత అన్న మాదిరి తయారయ్యింది. కరోనా తరువాత చాలా విషయాలు మారిపోయాయి. ఓ రకంగా మాట్లాడుకోవాలంటే మనిషి మనుగడే మారిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి నిలయమైన సినిమాల పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే మీడియం కేవలం థియేటర్ మాత్రమే. అదే ఇపుడు అనేక రకాల OTTలు మనిషికి అందుబాటులో వున్నాయి. కొత్త సినిమాని మన ఇంటిలోకే తెచ్చేసికుంటున్నాము.

దానికి ఉదాహరణగా తాజా పరిస్థితులను చెప్పుకోవచ్చు. ఇపుడు ఇదే విషయం సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పట్ల ఒకింత అసహనాన్ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు కొద్ది మందికి మాత్రమే పరిచయం వున్న ఓటీటీ సంస్కృతిని ఇపుడు సెల్ ఫోన్, ఇంటర్నెట్ వాడుతున్న ప్రతీ ఒక్కరికి అందుబాటులో వుంది. గత కొంత కాలంగా తమ కార్యకలాపాలని విస్తృతం చేయాలని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ కంపనీలకు పబ్లిసిటీ ఖర్చు లేకుండానే కరోనా ఓటీటీ ప్లాట్ ఫామ్లని ప్రతీ ఒక్కరికి చేరువయ్యేలా చేసింది.

ఇక కరోనా ఇపుడు బాగానే వుంది. అన్ని సద్దుమణిగాయి అని అనుకుంటే.. యేవో అరకొర సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు వెళుతున్నారు తప్ప, అన్ని సినిమాలకు వెళ్లలేని పరిస్థితి. తాజాగా ఓ సర్వేలో తేలింది ఏమంటే, ఓవరాల్ గా చూసుకుంటే OTT చూసే ప్రేక్షకులు ఆసియాలోనే ఎక్కువగా వున్నారని తేలింది. ఇదే గాని కొనసాగితే రాబోయే రోజుల్లో కళలకు నిలయమైన థియేటర్లు కనుమరుగవ్వాల్సిన పరిస్థితి దాపురిస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అందుకనే ప్రస్తుతం నిర్మాతలు సినిమాలకు అయ్యే ఖర్చులు తగ్గే పరిస్థితిగా ఆలోచిస్తున్నారని సమాచారం.