వైసీపీ ఆప‌రేష‌న్ కుప్పంలో ఇంత క‌థ న‌డుస్తుందా… బాబు ఏం చేస్తారో…!

ఏది అనుకుంటే.. దానిని సాధించ‌డం అల‌వాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబంధించి రెండు కీల‌క విష‌యాల‌పై నిర్దిష్ట‌మైన ల‌క్ష్యం పెట్టుకున్నారు. ఒక‌టి మ‌రోసారి అధికారం లోకి రావ‌డం.దీనికి సంబంధించి.. ఆయ‌న ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ముందుకు న‌డిపిస్తున్నారు. తాను కూడా త్వ‌రలోనే జిల్లాల యాత్ర చేయ‌నున్నారు. ఇక‌, రెండోది.. ప్ర‌తిప‌క్ష నాయ‌కు డు చంద్ర‌బాబును రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌డం.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు గ‌డిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించిన‌.. లేకున్నా.. ప్ర‌తి ఎన్నిక‌లోనూ చంద్ర‌బాబు విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే.. విజ‌యం ద‌క్కించుకుని చంద్ర‌బాబుకు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌నేది వైసీపీ వ్యూహం. గ‌తంలో అప్ప‌టి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెప్పేవారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును గెల‌వ‌మ‌నండి చూద్దాం! అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి.ఇక‌, వైసీపీ అధిష్టానం.. ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉంద‌న గానే `ఆప‌రేష‌న్ కుప్పం` చేప‌ట్టింది. ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌గా భ‌ర‌త్‌కు అవ‌కాశం క‌ల్పించింది. అదేస‌మ‌యంలో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబును ఓడించే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డికి అప్ప‌గించా రు. దీంతో ఆయ‌న త‌ర‌చుగా ఇక్క డ‌ప‌ర్య‌టిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా 200 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీలో చేర్పించారు. అదేస‌మ‌యంలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని మినీ మునిసిపాలిటీగా ప్ర‌క‌టించారు. ఇక్క‌డ నిరంత‌రం.. మంత్రి పెద్ద రెడ్డి తిరుగుతు న్నారు. ఎంపీ రెడ్డ‌ప్ప ప్ర‌త్యేకంగా .. ఇక్క‌డ డెవ‌ల‌ప్ మెంట్ కార్య‌క్ర‌మాలుసైతం నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, తాజాగా ఎమ్మెల్సీ భ‌ర‌త్ కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. పార్టీని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యంగా.. ముందుకు సాగుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ దూకుడు ముందు టీడీపీ నిలుస్తుందా? అనేది ప్ర‌శ్న‌. మ‌రి చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంపై ఏం చేస్తారో చూడాలి.