రవితేజ ఆ స్టార్ హీరో సవతి తల్లి కొడుకా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!!

టాలీవుడ్ మాస్ మహా రాజా రవితేజ గురించి కొత్త గా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే మాట్లాడేస్తాడు. నచ్చిన కధను ఎంత ఇష్టం చేస్తాడో..నచ్చని స్టోరీ లైన్ ని అంతే కరెక్ట్ గా రిజెక్ట్ చేస్తాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ సాధించిన ఈయన సినిమాలు..ఇప్పుడు బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిస్తున్నాయి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్కే కధను రిపీట్ చేస్తుండటం..జనాలకు బోర్ కొట్టింది. తాజాగా రిలీజ్ అయిన రామరావు ఆన్ డ్యూటి కూడా బోల్తా కొట్టింది.

ఇక ఇప్పుడు రవితేజ ఆశలన్ని చిరంజీవితో చేస్తున్న సినిమా పైనే పెట్టుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీ గా ఉన్నా చిరంజీవి..దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ హీరో రవితేజ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ విషయాని ఇప్పటికే మేకర్స్ అఫిషీయల్ గా అనౌన్స్ చేసారు. అంతేనా..షూటింగ్ లో కూడా పాల్గొన్ని రచ్చ రచ్చ చేసాడు.

ఈ సినిమాలో వీళ్లిద్దరి ని కలపడాని సీనియర్ హీరోయిన్ సుమలత కూడా నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి..ఓ క్రేజీ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే..ఈ సినిమా మొత్తం బ్రదర్స్ సెంటిమెంట్ మీద రన్ అవుతుందట. మరీ ముఖ్యంగా చిరంజీవి-రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా కనెక్ట్ అవుతాయట. ఈ సినిమాలో చిరంజీవికి రవితేజ వరుసకు తమ్ముడు అవుతారట. కానీ ఒక్కే తల్లి బిడ్డలు కాదట.

స‌వ‌తి త‌ల్లి కొడుకు ర‌వితేజ‌గా..భార్య పెద్ద కొడుకు చిరంజీవి గా కనిపించనున్నారట. వీరి ఇద్దరికి క్షణం కూడా పడదు అని గొడవలు జరుగుతుంటాయని.. అనుకోకుండా జరిగిన ఓ తప్పు వల్ల వీళ్లిద్దరు మళ్ళీ కలిసి ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు వీరి పాత్రల మ‌ధ్య ఊహించ‌ని ట్విస్ట్‌లు ఉండనున్నాయని సినీ వర్గాలల్లో ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. కనీసం ఈ సినిమాతో నైన రవితేజ హిట్ కొడతాడు ఏమో చూడాలి..?