స‌మంత లెస్బియ‌న్….వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

బేసిగ్గా తమిళియన్ అయిన హీరోయిన్ సమంత తెలుగులోనే మంచి ప్రాచుర్యం పొందింది. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’తో తెలుగు యువత హృదయాలను మాయ చేసింది సమంత. అనతికాలంలోనే అగ్రహీరోలందరితోను నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలో అక్కినేని వారసుడు అయినటువంటి నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వరుసగా జరిగిపోయాయి. తరువాత కొన్ని అనూహ్య కారణాలవలన ఆ జంట విడిపోయింది. ఆ తరువాత సమంత కెరీర్ కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, మరలా జెట్ స్పీడుతో పుంజుకొని దూసుకుపోతోంది.

సామ్ కెరీర్ గ్రాఫ్:
ఓ రకంగా ‘ఫామిలీ మాన్ 2’ తరువాత సామ్ కెరీర్ మారిపోయిందని చెప్పుకోవాలి. శాకుంతలం లాంటి పౌరాణిక చిత్రం చేస్తూనే తమిళ మల్టీస్టారర్ సినిమాలో గ్లామర్ రోల్ చేసి ఆకట్టుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఆ మధ్య పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నర్తించి మెప్పించింది సమంత. దాంతో పాన్ ఇండియా రేంజ్ వచ్చేసింది. ఇక కొన్నాళ్ళనుండి ఓ ఆసక్తికరమైన అంశం బయటకు పొక్కింది. అదే సమంతకి హాలీవుడ్లో అవకాశం రావడం.

హాలీవుడ్ సినిమాలో పాత్ర ఇదే:
అవును.. త్వరలో సామ్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించనుందని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సామ్ నటించిన కొన్ని చిత్రాలు చూసిన ఓ హాలీవుడ్ డైరెక్టర్ సమంత ప్రధాన పాత్రలో ఓ ఇంగ్లీష్ సినిమా చేసేందుకు సంప్రదించారట. కాన్సెప్ట్ నచ్చడంతో సమమత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వినికిడి. అయితే ఈ సినిమాలోని పాత్ర కాస్త ఛాలెంజింగ్ రోల్ అని తెలుస్తోంది. ఈ హాలీవుడ్ మూవీలో సామ్ లెస్బియన్ పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనుంది.

Share post:

Latest