సర్వే ఎఫెక్ట్: బాబుకు జాకీలు వేస్ట్?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి..చంద్రబాబుకు ఒకటే పని…ఎంతసేపు జగన్ పై విమర్శలు చేయడం..జగన్ వల్ల రాష్ట్రం నాశనమైపోయిందని మాట్లాడటం..అలాగే తాను ఉంటే రాష్ట్రం పరిస్తితి ఇలా ఉండేది కాదని చెప్పుకోవడం. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తుంది. అసలు అనుకూల మీడియా అయితే బాబుని పైకి లేపడానికి నానా తంటాలు పడుతుంది. జగన్ ని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడం..చంద్రబాబుని జాకీలు పెట్టి పైకి లేపడం. ఇదే టీడీపీ అనుకూల మీడియా పని.

అందుకే జగన్ సైతం…దుష్టచతుష్టయం అంటూ పదే పదే టీడీపీ అనుకూల మీడియాపై విమర్శలు చేస్తున్నారు..మంచి పనులు చేస్తున్నా కూడా చెడుగా చూపించడమే దుష్టచతుష్టయం పని అని, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారని మాట్లాడుతున్నారు. ఎంత చేసిన టీడీపీ అనుకూల మీడియా పని ఒక్కటే..వెంటనే బాబుని అధికారంలోకి తీసుకురావడం.  అయితే ఎన్ని జాకీలు పెట్టి లేపిన బాబుకు నెక్స్ట్ అధికారం దక్కడం కష్టమే అని పలు సర్వేలు చెబుతున్నాయి.

తాజాగా ఇండియా టి‌వి సర్వేలో సైతం వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. పార్లమెంట్ సీటులకు సంబంధించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ 19 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, ఇక టీడీపీ 6 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని తేలింది. గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీలని గెలుచుకోగా, టీడీపీ 3 ఎంపీలని గెలుచుకుంది. కానీ ఇప్పుడు వైసీపీకి 3 ఎంపీ సీట్లు తగ్గుతుండగా, టీడీపీకి 3 సీట్లు పెరుగుతున్నాయి.

వైసీపీకి సీట్లు తగ్గిన సరే…ఆ పార్టీ బలం పెద్దగా తగ్గలేదని తెలుస్తోంది. 19 ఎంపీ సీట్లు అంటే..మరోసారి వైసీపీకి అధికారం దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఇదే పరిస్తితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బాబుకు అధికారం దక్కడం కల్లే.

Share post:

Latest