హరికృష్ణ వద్దు వద్దు అని చెప్పిన.. బాలయ్య బలవంతంగా పట్టుబట్టి చేసిన పని ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ రేంజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అన్నగారు స్వర్గీయ తారక రామారావు గారు అలాంటి ఓ గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించి పెట్టారు. ఆ తరువాత ఆయన వారసత్వంగా వచ్చినా అందరు..నటన లో మెప్పించి..ఆయన పేరుని నిలబెట్టారు. కాగా, నందమూరి కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన మూడో తరంలో ఫస్ట్ వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. ఆయన చిన్న పిల్లాడిగా ఉన్న టైంలోనే ‘బాల గోపాలుడు’ అనే సినిమాలో నటించి..తన నటనతో మెప్పించారు.

ఇంత చిన్న వయసులోనే ఆయన కళ్లతో పలికించిన ఎక్స్ ప్రేషన్స్ అందరిని ఆకట్టుకున్నారు. కొందరు అయితే..నందమూరి రక్తం ప్రవహిస్తున్న బాడీ..ఆయన నట బుద్ధులు టాలెంట్ ఎక్కది పోతాయి..శభాష్ నందమూరి వారసుడా అని అనిపించుకున్నాడు. ఈ సినిమా లో హీరో బాలకృష్ణ. ఈ సినిమా చేస్తున్న టైంలో కళ్యాణ్ రామ్ 7th క్లాస్ చదువుతున్నాడు. నిజానికి ఈ సినిమా చేయడం కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ కి అస్సలు ఇష్టం లేదట. ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు వద్దు వద్దు అంటూ చాలా రోజులు మొండి గా మాట వినలేదట.

సినిమాలు అంటే ఇష్టం లేక కాదు..తన కొడుకు సినిమాలోకి రాకూడదు అని అస్సలు కాదు. అది చిన్న ఏజ్..పైగా చదువుకుంటున్నాడు..అలాంటి టైంలో కల్యాణ్ రామ్ మైండ్ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక..ఒక్కవేళ సినిమాల పై ఇంట్రెస్ట్ చూయిస్తే చదువు దెబ్బతింటుందని.. బాల గోపాలుడు సినిమాలో అవకాశం వచ్చిన హరికృష్ణ తన కొడుకు కళ్యాణ్ రామ్ సినిమాలో చేయడానికి ఒప్పుకోలేదట. ఆ టైంలో నట సింహం బాలయ్య ఎంట్రీ ఇచ్చి..మ్యాటర్ మొత్తం వన్ డే లో సాల్వ్ చేసారట.

తనదైన స్టైల్ లో బాలయ్య..హరికృష్ణ తో మాట్లాడి..కళ్యాణ్ రామ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా బాల గోపాలుడు సినిమా లో నటించేలా చేసారట. కానీ, ఈ సినిమా తరువాత మాత్రం ఆయన మరే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదట. మొత్తం దృష్టి చదువుల పైనే పెట్టారట. ఈ విషయాలన్ని స్వయంగా నందమూరి కళ్యాణ్ రామ్ తన ‘బింబిసార’ ప్రమోషన్లలో భాగంగా ‘మనసులో మాట’ అనే పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసి తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు. ఇంకా నందమూరి అబ్బాయి ఏం చెప్పారో ఈ క్రింది వీడియో చూడండి ..!!