చివ‌రి నిముషంలో చంద్ర‌బాబుకు క్రెడిట్ లాస్‌!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒక్కొక్క సారి తెలిసి మాట్లాడ‌తారో.. తెలియ‌క మాట్లాడ‌తారో.. లేక‌.. ఫ్రెస్ట్రేష‌న్ లో నోరు జార‌తారో తెలియ‌దు కానీ.. సెంట‌రాఫ్‌ది టాపిక్ అయిపోతారు. అప్ప‌టి వ‌ర‌కు సంపాయించుకు న్న ఇమేజ్‌ను ఒక్క‌సారిగా కోల్పోతున్నారు. ఇప్ప‌టికి ఇది మూడోసారి. గ‌త మ‌హానాడు నుంచి చూస్తే.. పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాయించుకోవ‌డం.. ఆవెంట‌నే.. ఏదొ చిన్న త‌ప్పు దొర్ల‌డం.. దీనిని ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. భూత‌ద్దంలో చూపించ‌డం.. ప‌రిపాటిగా మారింది.

- Advertisement -

ఇప్పుడు కూడా.. చంద్ర‌బాబు ఇలానే చేశార‌నే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో వ‌రుస పెట్టిప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఎక్క‌డెక్క‌డో..మారు మూల‌ప్రాంతాల‌ను కూడా ఎంచుకుని.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ద్య తిరుగుతున్నారు. బాధితుల‌కు భ‌రోసా నింపుతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై \విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. వేల రూపాయ‌ల న‌ష్టం జ‌రిగితే.. కేవ‌లం రెండు వేలు ఇవ్వ‌డం ఏంట‌ని.. బాబు ప్ర‌శ్నించారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. రూ.2000 ఇచ్చి.. 4000 వేల సార్లు.. సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం చేసుకుం టున్నాడ‌ని.. ఆ మనిషికి ఏమైనా బుద్ధుందా? అని .. చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఇది ప్రచార యావ ఉన్న ప్ర‌భుత్వం.. అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. అయితే..ఈ రెండు కామెంట్లే.. ఆయ‌న చేసిన ఇంత ప‌నినీ నీరు గార్చింది. ఇప్పుడు ఈ రెండు వ్యాఖ్య‌లు చుట్టూ రాజ‌కీయం తిరుగుతోంది. ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.

గ‌తంలో చంద్ర‌బాబు.. రూ.200 పింఛ‌న్ ఇచ్చి.. 2000 సార్లు ప్ర‌క‌ట‌న‌లు చేసుకున్న విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు ప్ర‌స్తావిస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ.. ఇదే త‌ర‌హా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఏమీ లేకుండా.. ఏదో చేసిన‌ట్టు రాజ‌ధానిపై ప్ర‌చారం చేసుకోలేదా? కేంద్రం ప్ర‌భుత్వ నిధులతో వేయించిన రోడ్ల‌ను కూడా త‌ను వేయించిన‌ట్టు ప్ర‌చారం చేసుకోలేదా? అని నిల‌దీస్తున్నారు. ఏదేమైనా.. ఇంత చేసిందంతా.. ఈ కామెంట్ల‌తో తుడిచిపెట్టుకు పోవ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Popular