నో సీట్: ఆ జిల్లాలో భారీ మార్పు?

సరిగ్గా ఆరు అంటే ఆరు నెలలు…ఈ లోపు ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరుచుకోకపోతే మొహమాటం లేకుండా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్..ఇటీవల వైసీపీ వర్క్ షాపులో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడప గడపకు వెళ్ళడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని, వారికి ఇంకో ఆరు నెలల సమయం ఇస్తున్నానని, ఈలోపు వారు ప్రజల దగ్గరకు వెళ్ళి…వారి మద్ధతు పెంచుకోకపోతే…నెక్స్ట్ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, తర్వాత తన మీద అలిగిన ప్రయోజనం లేదని జగన్ చెప్పేశారు.

అయితే ఈ ఆరు నెలల్లో ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళి..ప్రజా మద్ధతు పెంచుకుంటారో చెప్పలేని పరిస్తితి..ఇప్పటికే ప్రజల్లోకి వెళుతుంటే కొందరు ఎమ్మెల్యేలకు అంతా రివర్స్ అవుతుంది..ప్రజలే రివర్స్ అయ్యి..ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొందరు ప్రజల్లోకి వెళ్లడానికి ఆలోచిస్తున్నారు. అలాగే మరికొందరుపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. మరి ఇదంతా ఆరు నెలల్లోనే సెట్ చేసుకోవడం చాలా కష్టం. ఏదేమైనా నెక్స్ట్ ఎన్నికల్లో కొందరి సీట్లు మాత్రం చిరిగేలా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే చాలా సీట్లలో జగన్ అభ్యర్ధులని మార్చిన విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జగన్ అభ్యర్ధులని మార్చడం గ్యారెంటీ అని తెలుస్తోంది…మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా కొందరిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీడీపీ బలంగా కనబడుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ మార్పులు జరిగేలా ఉన్నాయి. గత ఎన్నికల్లోనే జగన్ మార్పులు గట్టిగానే చేశారు. చిలకలూరిపేట, పొన్నూరు, తెనాలి, వినుకొండ, పెదకూరపాడు, గురజాల, తాడికొండ లాంటి స్థానాల్లో కొత్త అభ్యర్ధులని పెట్టి సక్సెస్ అయ్యారు.

అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా మార్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీనియర్ల సీట్లని మార్చే అవకాశాలు లేదు గాని…ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలుగా గెలిచిన సీట్లని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు సీట్లలో ఇప్పుడున్న వారిని పక్కన పెట్టి కొత్త అభ్యర్ధులని పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి గుంటూరు వైసీపీలో ఈ సారి భారీ మార్పులు జరిగేలా ఉన్నాయి.