బీ అలెర్ట్: నెగిటివ్ పెంచేస్తున్న బాబు!

రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడమే నాయకుల టార్గెట్..వారు ఎంత రాజకీయం చేసిన అది అధికారం కోసమే. ఇప్పుడు అదే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి బాబు టార్గెట్ ఒక్కటే…ఎలా అయిన జగన్ ని నెగిటివ్ చేయాలి…నెక్స్ట్ తాను గెలిచి అధికార పీఠం ఎక్కాలి. ఇదే టార్గెట్ గా బాబు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకొస్తున్నారు. తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బాబు వదులుకోవడం లేదు..ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు.

ఎలాగైనా జగన్ పై నెగిటివ్ తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ…ఏదొక సరికొత్త టాపిక్ ని తీసుకొచ్చి..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరదలని సైతం రాజకీయాలకు వాడేయడం మొదలుపెట్టారు. అనుహంగా వచ్చిన గోదావరి వరదలకు ప్రజలు తీవ్రంగానే నష్టపోయారు. అయితే ప్రజల నష్టాన్ని తగ్గించడానికి జగన్ ప్రభుత్వం బాగానే ట్రై చేస్తుంది. ప్రజలకు అండగా ఉండే ప్రయత్నాలు చేస్తుంది…కాకపోతే పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా ఉండటంలో వైసీపీ ప్రజాప్రతినిధులు కాస్త విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు.

అలాగే ప్రభుత్వ సాయంపై ప్రజలు కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు…అందుకే వరుసపెట్టి వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేశారు. ఇక ఎప్పుడు మాదిరిగానే జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సాయంలో డొల్లతనం ఉందని, ఇక వైఫల్యాలు దాచడానికి వైసీపీ నానా తంటాలు పడుతుందని, 77 గ్రామాలు ఇంకా వరదలోనే ఉన్నాయని,  తెలంగాణలో పదేసి వేలు ఇస్తుంటే, ఇక్కడ మాత్రం బియ్యానికీ గతి లేదని, నాలుగేసి ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇచ్చారని మండిపడ్డారు. ఇలా ప్రతి అంశంలోనూ వైసీపీ టార్గెట్ గా బాబు విరుచుకుపడ్డారు. ఇక బాబు విమర్శలు గాని ప్రజలు నమ్మితే జగన్ పై ఇంకా నెగిటివ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి…కాబట్టి వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది…వారు ఇంకా ఎక్కువగా ప్రజల్లో ఉంటూ అండగా ఉండాలి…అప్పుడే బాబు నెగిటివ్ ని ఆపగలుగుతారు లేదంటే అంతే సంగతులు.