ఆ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్.. దేవి ఏం చేస్తాడో చూడాలి మరి?

పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ పేరు దిగంతాలకు పాకింది. ఈ విషయంలో బన్నీ అభిమానులు మంచి హుషారుగా వున్నారు. అయితే తాజాగా ఈ అభిమానులు ఒక విషయంలో మాత్రం ఒకింత టెన్షన్ పడుతున్నారట. అదే దేవి శ్రీ ప్రసాద్ గురించి. పుష్ప సినిమాకు దేవి అందించిన మ్యూజిక్ ఎంత ప్లస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు దేవి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ ని రాబట్టిన ఆల్బమ్ గానూ పుష్ప రికార్డు సాధించిన విషయం తెలిసినదే.

టెన్షన్ ఇందుకేనట!

ఇకపోతే దేవి తాజాగా వారియర్ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీలోని బుల్లెట్ సాంగ్ తెలుగుతో పాటు తమిళంలో కూడా వైరల్ అయ్యింది. అయితే సినిమా విడుదల అయిన తరువాత మాత్రం నేపథ్య సంగీతం విషయంలో రామ్ ఫాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్ కూడా కాస్త నొచ్చుకున్నారు. అప్ టు ద మార్క్ స్టేజ్ లో లేకపోవడం సీన్ లని ఎలివేట్ చేసే స్థాయిలో కుదరకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఇపుడు తన హీరో సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నారని వినికిడి.

సుకుమార్-దేవి-బన్నీ మార్క్ వుంటుందా?

అయితే కొంతమంది అభిమానులు మాత్రం సుకుమార్-దేవి-బన్నీ మార్క్ సంగీతానికి మార్కులు వేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ కి వీరి చెక్ పెడుతున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కదా. వచ్చిన దాదాపు సినిమాలలోని పాటలు కావచ్చు, నేపధ్య సంగీతం కావచ్చు… సూపర్ డూపర్ హిట్ కదా.. ఇలాంటి తరుణంలో వారి కాంబినేషన్లో అనుమానమే ఉండకూడని ఓ వర్గం వారు వాదిస్తున్నారు. ఇక ఏదిఏమైనా ఆ కాంబినేషన్ హిట్ పరంపరను కొనసాగించాలని మనం కూడా కోరుకుందాం.