మోడీ వ్యూహం అనుస‌రిస్తే.. జ‌గ‌న్‌ గెలుపు ప‌క్కా…!

రాజ‌కీయాల్లో ఎంత పెద్ద నాయ‌కుడు అయినా.. ఎంత భారీ మెజారిటీ ఉన్నా.. లౌక్యం ముఖ్యం. ప్ర‌తిప‌క్షా లు ఏమంటున్నాయి? ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నాయి.? వాటికి మ‌నం కౌంట‌ర్ ఎలా ఇవ్వాలి? అనే విష‌యాల‌పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం ప్ర‌బుత్వంలో ఉన్న పార్టీల‌కు ప‌నికిరాదు. ముఖ్యంగా ప్ర‌బుత్వాధి నేత‌ల‌కు అస్స‌లే ప‌నికిరాదు. ఎప్పుడైనా.. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు చేయాల్సి వ‌స్తే.. ఆ విమ‌ర్శ‌.. సంచ‌ల‌నంగా ఉండాలి. ఇదీ.. ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ నాయ‌కులు అనుస‌రించాల్సిన విష‌యం.

ప్ర‌తిదానికీ.. త‌డ‌బ‌డ‌డం.. ప్ర‌తిప‌క్షాలు ఏదో చేస్తున్నాయ‌ని.. మీడియా ఏదో రాస్తోంద‌ని.. ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం .. విమ‌ర్శ‌లు సంధించ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోడీ అనుస‌రిస్తున్న‌వ్యూహం ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బాగా ఉప‌క‌రిస్తుంద‌ని అంటున్నా రు. మోడీపై దేశంలో నిత్యం ఎక్క‌డో ఒక చోట తీవ్ర విమ‌ర్శ‌లు.. వ్య‌తిర‌క‌త క‌నిపిస్తూనే ఉంటుంది. అయి నా.. ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట ప‌డిపోరు.. చాలా ఆలోచ‌నాత్మ‌కంగా ఉంటారు.

అదేస‌మ‌యంలోకేంద్రం చేస్తున్న సంక్షేమాన్ని ఎప్పుడూ.. లైవ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. అంటే .. తాను ఇచ్చింది , చేసింది. చేయ‌బోయేది.. పిస‌రంతే అయినా.. కొండంత ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రోజూ ప్ర‌ధాని.. ప్ర‌జ‌ల‌తో వ‌ర్చువ‌ల్‌గా మాట్టాడ‌డం.. లబ్ధి దారుల‌ను వు్ద్దేశించి ప్ర‌సంగించ డం.. ప్ర‌తి ఒక్క‌రితో ఆన్‌లైన్‌లోనే ఇంట‌రాక్ట్ కావ‌డం.. వంటివి చేస్తున్నారు. దీనివ‌ల్ల‌.. తాను ఏదో గొప్ప‌గా చేస్తున్నాన‌నే సందేశాన్ని ప్ర‌ధాని ఈ దేశం మొత్తానికి పంపిస్తున్నారు.

నిజానికి కేంద్రంతో పోల్చుకుంటే.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమం చాలా ఎక్కువా ఉంది. ల‌బ్ధిదారుల‌కు భారీ ఎత్తున నిధులు కూడా ఇస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. జ‌నంలో ఎక్క‌డా ఈ త‌ర‌హా పాజిటివ్ టాక్ వినిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌జ‌ల‌తో నేరుగా.. జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట‌రాక్ట్ అయింది లేదు. నిత్యం వారితో చ‌ర్చ‌లు జ‌రిపింది లేదు. ఎంత‌సేపూ.. అధికారుల‌తో స‌మీక్ష‌ల‌కే ప‌రిమితం అవుతున్నారు. దీంతో ఎంత చేస్తున్నా.. అంతా .. గ‌ప్‌చుప్ అన్న‌ట్టుగా ఉంది. ఈ నేప‌థ్యంలో మోడీ అనుస‌రిస్తున్న ప్ర‌చార విధానాన్ని ఏపీ సీఎం కూడా అనుస‌రిస్తే.. మంచి ఊపు వ‌స్తుంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share post:

Popular