గుడివాడ‌పై చంద్ర‌బాబు గురి.. న‌యా స్కెచ్…!

అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గుడివాడ‌పై చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేస్తారా? ఇక్క‌డ టీడీపీకి ఆయ‌న ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు ఇక్క‌డ ప‌ర్య‌టించ‌నున్నారు. మ‌రో రెండు రోజుల్లోనే ఆయ‌న ఇక్క‌డ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మినీ మ‌హానాడును నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్ర‌బాబును తిట్టిపోయ‌డం.. టీడీపీని తిట్టిపోయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు.. కొడాలి నాని.. ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుడివాడ‌లో చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో తొలిసారి ప‌ర్య‌టిస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది. నిజానికి వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. నాని మ‌రింత దూకుడు పెంచారు. చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుమారుడుపైనా.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పార్టీ ఒక‌ర‌కంగా.. డిఫెన్స్‌లో ప‌డిపోయింది. నానికి బ‌లంగా కౌంట‌ర్ ఇచ్చే నాయ‌కుడు కూ డా ఇక్క‌డ క‌నిపించ‌లేదు. దీంతో నాని దూకుడు మ‌రింత‌గా పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చంద్రబా బు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఎలా రియాక్ట్ అవుతారు? నాని నోటి దూల‌కు.. ఎలా చెక్ పెడ‌తారు? ముఖ్యంగా సంక్రాంతి స‌మ‌యంలో ఇక్క‌డ కేసినో నిర్వ‌హించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు వాటి పైనా రియాక్ట్ అవుతారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది.

ఇవ‌న్నీ ఇలా.. ఉంటే.. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. నానికి షాక్ ఇస్తామ‌ని.. త‌ర‌చుగా చెబుతున్న చంద్ర‌బాబు.. ఆదిశ‌గా ఎలాంటి కీల‌క‌మైన నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారా? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న త‌మ్ముళ్ల‌కు ఆయ‌న చేసే దిశానిర్దేశం ఏంటి? అనేది కూడా ఆస‌క్తిగా ఉంది. ఈ నేప‌థ్యంలో గుడివాడ‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొన‌డంగ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share post:

Popular