ఆ నాటి తప్పుకు ఈనాడు రిజల్ట్…కోర్టు మెట్లు ఎక్కిన మంచు మోహన్ బాబు అండ్ సన్స్…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇప్పుడంటే క్రేజ్ తగ్గిపోయింది కానీ..ఆ రోజుల్లో అన్నగారితో కలిసి సినిమాల్లో నటించే రోజుల్లో మోహన్ బాబు అంటే జనాలకు అదో పిచ్చి. విపరీతమైన క్రేజ్ ఉండేది. తెర పై ఆయన గంభీరంగా డైలాగ్స్ చెప్పుతుంటే గూస్ బంప్స్ వచ్చేవి. అప్పట్లో ఆయన నటించే సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే ఆయనకు కలెక్షన్ కింగ్ అంటూ బిరుదు ఇచ్చారు.

- Advertisement -

అయితే, మొహన్ బాబు శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్ధలను నడుపుతున్నాడు. సినిమా పరంగా శభాష్ అనిపించుకున్న మోహన్ బాబు రాజకీయాల్లోను అడుగుపెట్టి డిజాస్టర్ అయ్యాడు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నా..ఎందుకో రాజకీయాల్లో నెట్టుకురాలేకపోయాడు. ప్రజెంట్ అటు సినిమాల్లో క్రేజ్ తగ్గిపోయి..ఇటు రాజకీయాల్లోను అనుకున్నంత స్ధాయి రాలేక ..విద్యాసంస్ధలతోనే టైం పాస్ చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

కాగా, కొద్దిసెప్పటి క్రితమే మంచు మోహన్ బాబు ..తన ఇద్దరు కొడుకులతో కలిసి కొర్టు విచారణకు హాజరైయ్యారు. మనకు తెలిసిందే గతంలో చంద్రబాబు పాలనలో మోహన్ బాబు కాలేజీలకు ఇవ్వాల్సిన రీఎంబర్స్ మెంట్ రాలేదని..తన కొడుకులు, కొందరు స్టూడెంట్లతో కలిసి ధర్నా చేశాడు. అడ్డంగా పడుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మధ్యలో కాస్త అతి కూడా చేశారట. ఆ ఎఫెక్ట్ తోనే మోహన్ బాబు , కోడుకుల పై కేసు నమోదైంది. ఆనాటి కేసు విచారణ వాయిదాలకు ఇన్నాళ్లు డుమ్మా కొడుతూ వచ్చిన మంచు సన్స్..విచారణకు హాజరు కాకపోతూండటంతో ఫైనల్ గా వారెంట్ వచ్చే పరిస్థితి నెలకొనడంతో ..లాస్ట్ కి ఈ సారి విచారణకు ఇద్దరు కుమారులతో కలిసి తనలోని రాజకీయ నాయకుడిని బయటపెడుతూ పాదయాత్రగా కోర్టుకు హాజరయ్యారు మంచు మోహన్ బాబు. ఇక్కడ డౌట్ కొట్టే విషయం ఏమిటంటే..ఆ నాడు చంద్రబాను హయాంలో ఫీజురీఎంబర్స్ మెంట్ డబ్బులు రాలేదని గొంతు చించుకున్న ఈ బాబు..ఈనాడు జగన్ పాలనలో తన విద్యా సంస్ధలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ అందకపోయినట్లు వార్తలు వినిపిస్తున్నా సైలెంట్ గా ఉండడం ప్రశ్నార్ధకంగా మారింది.

Share post:

Popular