కెరీర్ లోనే ఫస్ట్ టైం వెంకటేశ్‌ ట్రిపుల్ రెమ్యూనరేషన్..F3 సంచలన రికార్డ్..?

ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కళ్లు అన్నీ F3 సినిమా పైనే ఉన్నాయి. ఇన్నాళ్లు పెద్ద సినిమాల హవా నడిచింది . సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా..పెద్ద సినిమాల ధాటికి తట్టుకోలేం అన్న భయంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి..సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ..ఎవ్వరికి అడ్డుకాకుండా ..ఎవ్వరు అడ్డులేకుండా ..కూల్ గా సమ్మర్ ట్రీట్ కి కూల్ కామెడీ బ్రీజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మే27న సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా F2 మూవీ కి సీక్వెల్ అని తెలిసిందే. వెంకీ, వరుణ్ తేజ హీరోలుగా మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం..ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా మనముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా మెహ్రీన్, తమన్నా నటించారు. అందలా ఆరబోతల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా..ఫుల్ రచ్చ రచ్చ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్,పాటలు ,టీజర్ , ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు.

F2 సినిమాకు మించిన కామెడీ ఎఫ్‌ 3లో మోర్‌ ఫన్‌ ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. అయితే, ఈ సినిమాకి వెంకీ తీసుకున్న పారితోషకం ఇప్పుడు ఇందస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి వెంకీ కెరీ డౌన్ అయ్యింది. అంత ఫాంలో లేడు. క్రేజ్ కూడా తగ్గింది. దీంతో రెమ్యూనరేషన్ మ్యాటర్స్ అస్సలు పట్టించుకోవడం లేదు వెంకటేశ్. కాగా, ఈ సినిమాకి వెంకీ తన నార్మల్ రెమ్యూనరేషన్ మీద ట్రిపు ఎక్కువ తీసుకున్నరంటూ ఓ వార్త వైరల్ గా మారింది. ఫ్2 సినిమాకి వెంకి 7 కోట్లు పారితోషకం పుచ్చుకున్నట్లు టాక్ వినపడింది. ఇక ఆ లెక్కన చూసుకుంటే ఈసినిమాకి వెంకీ 21 కోట్లు పుచ్చుకున్నారన్న మాట. మిగతా హీరోలతో కంపేర్ చేస్తే ఇది తక్కువే కానీ,, వ్యక్తిగతం తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోలేదట వెంకి..మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందో..?

Share post:

Latest