F3 నాలుగు రోజుల కలెక్షన్స్: ఇప్పుడు చెప్పిండి రా బొమ్మ హిట్టా..ఫట్టా..?

ఈ రోజుల్లో ఓ సినిమా చూసి నవ్వుకోవడం అంటే పెద్ద గగనమే. పాన్ ఇండియా సినిమాలు అంటూ పెద్ద హీరోలు పాకులాడుతుంటే..చిన్న హీరోలు వచ్చి రాని కామెడీ తో ఏదో నెట్టుకోస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి అందరి జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో ఫ్3 సినిమాని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి కామెడీ పండిచదం అంటే అది మామూలు విషయం కాదు. దానికి ఏంతో పక్క ప్లానింగ్ ఉండాలి. అలా అనిల్ రావిపూడి..సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్, మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి..ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పేరిట ఓ సినిమాను తెరకెక్కించారు.

ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమానే ఈ F3. తమన్న , మెహ్రీన్, సోనాలీ చౌహాన్ లాంటి ముద్దుగుమ్మలతో మోస్ట్ కామెడి ఎంటర్ టైనర్ గా ఈ మూవీనీ తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు అనిల్. అయితే, ఈ సినిమా మే27 న ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ పరంగా నవ్వుకోవచ్చు అంటూ కొందరు అంటుంటే..అంత సీన్ లేదు..అందరి హీరోల సినిమాల్లోని డైలాగ్స్ వాడుకుని తన సినిమాను హిట్ చేసుకున్నాడు అనిల్ అంటూ కామెంట్స్ చేసే వాళ్లు ఉన్నారు. దీంతో సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సరే, టాక్ పరంగా ఎలాగున్నా..కలెక్షన్స్ పరంగా అసలు సినిమా టాక్ బయటపడుతుందని అందరు వెయిట్ చేస్తున్నారు. కాగా, F3 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పర్లేదు అనిపించినా..ఆ తరువాత సీన్ మారిపోయిన్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ మొత్తంగా చూసుకుంటే ‘ఎఫ్ 2’ కంటే.. ‘ఎఫ్ 3’కి డబుల్ అయ్యింది. ఈ లెక్కన ‘ఎఫ్ 3’ రెట్టింపు కలెక్షన్స్ రాబట్టాలి. ఆ పరిస్థితి అయితే, ప్రస్తుతం కనిపించడం లేదు. అయితే ఈ సినిమా తొలి వీకెండ్ ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా రూ.34 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి తన సత్తా చాటింది. ఇక నాలుగో రోజు కూడా త‌న స్టామినా చూపించింది F3 సినిమా. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు రూ.4.64 కోట్లు రాబ‌ట్టిన‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌. ఏపీ, తెలంగాణ‌లో నాలుగు రోజుల్లో మొత్తం షేర్ రూ.32.11 కోట్ల‌ని లేటెస్ట్ టాక్‌ వినిపిస్తుంది.

మొత్తంగా నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

నైజాం : రూ. 14.24 కోట్లు

సీడెడ్ : రూ. 4.27 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 4.04 కోట్లు

ఈస్ట్: రూ. 2.22 కోట్లు

వెస్ట్: రూ.1.73 కోట్లు

గుంటూరు: 2.34 కోట్లు

కృష్ణా : 2.05 కోట్లు

నెల్లూరు:1.33 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని నాలుగు రోజుల కలెక్షన్స్ గానూ రూ. 32.23 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.02 కోట్లు

ఓవర్సీస్ – 5.70 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.39.80 కోట్లు (గ్రాస్ రూ.66.90 కోట్లు)

గ్రాస్ పరంగా చూసుకుంటే.. 51.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

కాగా, ఈ సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడానికి చాలా కష్టం అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా రానున్న రోజుల్లో సుమారు మరో 25 కోట్లు రాబట్ట గలిగితే.. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ పరంగ హిట్ అయ్యింది అని చెప్పవచ్చు అంటున్నారు జనాలు. మరి చూడాలి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది..?