వార్నీ: ఆ విషయంలో రాజమౌళిని మించిపోయేలా ఉన్నావే అనీలు ..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా కానీ..జనాలకి కొందరే నచ్చుతారు. కోట్లు పెట్టి సినిమా తీయ్యలేకపోయినా..తక్కువ బడ్జెట్ తో నైన జనాలను నవ్వించగలిగితే చాలు అని అనుకునే జనాలు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి డైరెక్టర్ లల్లో ఈ అనిల్ రావిపూడి ఒకరు . పటాస్ చిత్రం లో తన పేరు ని అందరికి తెలిసేలా చేసుకున్న ఈయన..ఆ తరువాత తెరకెక్కించిన చిత్రాలన్ని కూడా జనాలను ఆకట్టుకున్నాయి. కాగా రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన F3 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

దగ్గుబాటి హీరో వెంకటేష్, మెగా హీరో రానా ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకి అదనంగా గ్లామర్ జోడించడానికి ఈ మూవీలో పూజా హెగ్డే తో ఐటెం సాంగ్ చేయించారు. ముగ్గురు ముద్దుగుమ్మల మధ్యన వెంకీ,వరుణ్..ఇరగదీశారు అని ఇప్పటికే రిలీజ్ అయిన అన్నీ అప్ డేట్స్ చూస్తేనే అర్ధమైపోతుంది. కాగా మే 27న సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినీ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు అనిల్.

నిజానికి సినిమా ను తెరకెక్కించడం పెద్ద గొప్ప కాదు..ఆ సినిమా జనాల్లోకి తీసుకెళ్లడం ముఖ్యం అంటూ ఆ విషయంలో జక్కన్న ది బెస్ట్ ఆయనను మించిన వాడు లేడు. సినిమా ప్రమోషన్స్ కి మూడు నెలల ముందే క్లీయర్ షెడ్యూల్ వేసి పక్క ప్లానింగ్ తో ఫాలో అవుతాదు అంటూ పొగిడేసే వారు జనాలు. ఇక ఇప్పుడు అనిల్ తన సినిమా ప్రమోషన్స్ ని చూశాక..రాజమౌళినే మించిపోయాడు..ఆ ఎనర్జీ ఏంటీ..ఆ ఫాలోయింగ్ ఏంటీ..ఆ కామెడీ టైమింగ్ ఏంటీ అంటూ జనాలు అనిల్ రావిపూడి ని పొగిడేస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన తీరు జనాల్లోకి బాగా వెళ్లింది. దీంతో అనిల్ ..రాజమౌళిని మించిపోయేలా ఉన్నారు అంటూ…పొగిడేస్తున్నారు జనాలు.

Share post:

Latest