NBK107: మళ్లీ ఆ హిట్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న బాలకృష్ణ..!!

నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్నారు. తన లక్కి డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగ రాసింది. అంతేనా..బాలయ్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య మనకు ఎప్పడు కనిపించని అఘోర గెటప్ లో కనిపించి..అభిమానులను మెప్పించారు. అంతేకాదు హిందు ధర్మాని కి ఉన్న విలువ గురించి..దాని ప్రత్యేకతల గురించి అర్ధమైయేలా వివరించారు.

కాగా, ఈ సీన్స్ అఖండ సినిమాకి హైలెట్ గా నిలిచాయి..సినిమా విజయానికి తోడు అయ్యాయి. ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ బాలకృష్ణ..తన నెక్స్ట్ సినిమా ప్రజెంట్ షూటింగ్ చేస్తున్న మూవీ NBK 107 వర్కింగ్ టైటిల్ తో రన్ అవుతున్న మూవీలోను హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే సీన్స్‌ ఉండేలా చూసుకోమన్నారట. ఇప్పటి వరకు గోపీ రాసుకున్న స్క్రిప్ట్ లో అలాంటీ సీన్స్ లేవట, అంతా మాస్ ఎంటర్ టైన్ మెంట్ లా గే ఉంటుందట.

అయితే, బాలయ్య అడగటంతో ఇప్పుడు కధలో మార్పులు చేస్తూ..బాలయ్యకు నచ్చిన విధంగా..ఛెంజ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో కూడా మనం బాలయ్య బాబుని డ్యూయెల్ రోల్ లో చూడబోతున్నాం. ఒకటి మాస్ లుక్ అయితే..మరోకటి క్లాస్ యంగ్ లుక్ లో బాలయ్య మనల్ని కనువిందు చేయనున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా..వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య అనిల్ రావిపూడితో మరో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు.

Share post:

Latest