ఆ హీరో భజన ..మెగా ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..?

యస్.. ఇండస్ట్రీలో జరుగుతున్న పనులు చూస్తుంటే అందరు ఇదే కరెక్ట్ అంటున్నారు. జనరల్ గా సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడం కామన్ నే. అది కూడా చిన్న సినిమాలకి.. లేక చిన్న హీరోలు..యంగ్ హీరోలు ప్రజల్లో కొత్త అటెన్ షన్ గ్రాబ్ చేయడానికి ..ఇలా చేస్తుంటారు. తమ సినిమా ప్రమోషన్స్ కోసం మరో స్టార్ హీరోని పిలిపించుకోవడం..లేదా ఆయన పేరు వాడుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ఇక్కడ మెగాస్టార్.. సైతం తన సినిమా ప్రమోషన్స్ కి ఆ స్టార్ హీరోపేరును వాడుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

మనకు తెలిసిందే.. కొరటాల శివ డైరెక్షన్ లో..చిరంజీవి-చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం..ఎట్టకేలకు ఏప్రి 29 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను యమ ఫాస్ట్ గా లాగించేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా చిరు-చరణ్-కొరటాల 0అ ఇంటర్వ్యుల్లో పాల్గొన్నారు. అంతా బాగానే జరిగినా.. కానీ ఆచార్య సినిమాలో ఓ స్టార్ హీరో పేరు హైలెట్ అయ్యింది. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

ఈ సినిమాలో చరణ్ సిద్ధా అనే పాత్రలో మనకి కనిపించనున్నారు అని తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ కాకుండా ఆ పాత్ర ఎవ్వరు చేస్తే బాగుంటుందని అడగ్గా..చిరంజీవి వెంటనే టక్కున పవన్ అనేశాడు. చీరంజీవి కి నిజంగా ఆ ఫీలింగ్ ఉందో,, లేక పవన్ పేరుని తన సినిమాలో వాడుకోవాలి అనుకున్నాడో తెలియదు కానీ.. ఆ ఒక్క చిరు మాట్ల క్లిప్ ను క్రాప్ చేసి..సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కావలనే ఆచార్య సినిమాను డీ గ్రేడ్ చేయడానికి ఆయన మాటలను తప్పుగా క్రియేట్ చేస్తున్నారు . చిరంజీవి కూడా పవన్ పేరు ను తన సినిమా కోసం వాడుకుంటున్నారంటూ వైరల్ చేస్తున్నారు. దీంతో కొందరు మెగా హీరో భజన్ బ్యాచ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్య మెగా ఫ్యామిలీ ని బాగా టార్గెట్ చేస్తుంది.. ఓ సో కాల్డ్ హీరో ఫ్యామిలీ సంఘం..అన్నది అందరికి బాగా అర్ధమౌతుంది. మరి ఆచార్య రిజల్డ్ ఎలా ఉంటుందో..?

Share post:

Latest