ఆర్ఆర్ఆర్ దెబ్బకు మహేష్ ఒక్కడే అంటోన్న జక్కన్న

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రేస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మేనియా ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఎఫెక్ట్‌తో జక్కన్న తన నెక్ట్స్ చిత్రంలోనూ ఇలాంటి ఫార్ములానే కంటిన్యూ చేస్తాడని గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

రాజమౌళి తన నెక్ట్స్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ స్టార్ హీరో పాత్ర చాలా సేపు ఉంటుంది కాబట్టి, ఈ సినిమా కూడా మల్టీస్టారర్ మూవీ అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. అయితే ఇదంతా కేవలం ట్రాష్ అని కొట్టిపారేశారు జక్కన్న. మహేష్ కోసం రాసుకున్న కథలో అతడు ఒక్కడే హీరో అని జక్కన్న తేల్చి చెప్పాడు.

దీంతో మహేష్-రాజమౌళి కాంబోలో రాబోయే సినిమాలో మరో స్టార్ హీరో లేడని తేలిపోయింది. అయితే నందమూరి బాలకృష్ణతో ఈ స్టార్ హీరో పాత్రను రాజమౌళి ప్లా్న్ చేశాడని, మహేష్-బాలయ్యను ఒకే స్క్రీన్‌పై చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వస్తున్నాయని జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. ఏదేమైనా బాలయ్య-మహేష్‌లను ఒకే స్క్రీన్‌పై చూడాలని అనుకున్న వారి ఆశలపై జక్కన్న నీళ్లు చల్లాడని చెప్పాలి.

Share post:

Popular