బాబు చేయ‌లేనిది..జ‌గ‌న్ చేసి చూపించారు..!

అధికారం ఉండ‌గానే కాదు.. దానిని ఎలా వినియోగించుకోవాలో.. రాష్ట్రానికి ఎలా మేళ్లు చేయాలో కూడా తెలియాలి. ఇది ఇప్పుడు సీఎం జ‌గ‌న్ చేసి చూపించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నేను 14 సంవ‌త్స రాలు.. రాష్ట్రాన్ని పాలించాన‌ని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేయ‌లేనివి చాలానే ఉన్నాయి. అంతెందుకు.. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు తాను అనేకం చేశాన‌ని.. హైద‌రాబాద్‌లో స్టూడియోల‌కు అనుమ‌తులు ఇచ్చాన‌ని పదే ప‌దే చెప్పుకొనే.. చంద్ర‌బాబు విబ‌జ‌న త‌ర్వాత‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి తీసుకురాలేక‌పోయారు.

రాజ‌ధాని విష‌యంలో సినిమా డైరెక్ట‌ర్ల స‌ల‌హాలు తీసుకున్నారు. అయితే.. ఇంత చేసినా.. ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీని ఏపీకి తీసుకురాలేక పోయారు. ప‌లితంగా.. ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయంపై దెబ్బ‌ప‌డింద‌నేది వాస్త‌వం. ప్ర‌స్తుతం తెలంగాణ‌కు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ నుంచి నెల‌కు 100 నుంచి 250 కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తోంది. అదేస‌మ‌యంలో స్టూడియోలు అన్నీ అక్క‌డే ఉండ‌డంతో వాటి తాలూకు ఆదాయం కూడా ప్ర‌భుత్వానికి అందుతోంది. మ‌రి ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా ఏమీ చేయ‌లేక పోయింద‌నే వాద‌న ఉంది.

చంద్ర‌బాబు త‌న ఐదేళ్ల‌లో సినిమా ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో మాట్టాడ‌డం కానీ.. వారిని ఏపీకి ర‌ప్పించే ప్ర‌య త్నం కానీ..చేయ‌లేదు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ దీనిని సాధించారు. త‌న న‌నోటి నుంచి కాకుండా.. సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల నుంచే ఈ మాట‌ను చెప్పించారు. ఏపీకి సినిమా ఇండ‌స్ట్రీని తీసుకువ‌స్తామ‌ని.. విశాఖ‌లో స్టూడియోలు క‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. క‌కొన్ని కొన్నికీల‌క‌మైన సినిమాల‌ను ఏపీలో న‌నూ నిర్మా ణం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. సాక్షాత్తూ చిరంజీవి ప్ర‌క‌టించారు. అంతేకాదు.. కీల‌క ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా ఇక్క‌డ‌కు ఇండ‌స్ట్రీ వ‌చ్చేలా చేస్తామ‌ని అన్నారు.

నిజానికి దీనివ‌ల్ల‌.. ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం విష‌యాన్ని పక్క‌న పెడితే.. రాష్ట్రం ప్ర‌తిష్ట మాత్రం పెరుగుతుంద‌నేదివాస్తవం. ముఖ్యంగా సినిమా నిర్మాణాలు సాగుతుంటే.. రాష్ట్రానికి జాతీయ‌స్థాయిలో ప‌ర్యాట‌క ప్రాంతంగా మంచి పేరు వ‌స్తుంది. అదేస‌మ‌యంలో ఉపాధి కూడా పెరుగుతుంది. చిన్ని చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఫ‌లితంగా రాష్ట్రాన‌నికి పేరుతో పాటు.. స్థానికంగా నిరుద్యోగుల‌కు అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయి. మొత్తానికి చంద్ర‌బాబు చేయ‌లేనిది.. జ‌గ‌న్ చేసి చూపించార‌నే వాద‌న‌లో నిజం ఉంద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు.


Leave a Reply

*